Tuesday, November 20, 2007

.....ఆహ్! ఇది కలా!

అది సాయంకాలం 6.00 గంటలసమయం అర్జంటుగా కాగజ్ నగర్ వెళ్ళమని మాబాసునుంచి ఫోను వచ్చింది. ఆలస్యం చెయ్యకుండా సికింద్రాబాదు ఉరుకులు పరుగులమీద వెళ్ళాను. అక్కడవున్న టిటిని అడిగాను ఏ రైలు ఎక్కాలి అని. 1వ నంబరు ఫ్లాటుఫారంమీద ట్రైను వుంది త్వరగా వెళ్ళు అన్నాడు. ఫ్ళాటఫ్హరంమీదకు వెళ్ళే సరికి ట్రైన్ కదులుతూ కనిపించింది. పరుగెత్తి దొరికిన డోర్ లో ఎక్కేసాను. బోగీ చాలా ఖాళీగావుంది. పైబెర్తుపై చోటుచేసుకొని పడుకున్నను. ఎంతసేపు నిద్రపొయానో తెలియదు టిటి.నంటూ నిద్రలేపి టికెట్టు అడిగాడు, చూపించాను. నావంక ఎగాదిగాచూసి ఇది ఎ.పి. ఎక్స్ ప్రెస్స్ వెళ్ళదు కాబట్టి దిగిపో అనిచెప్పాడు. కొద్దిసేపట్లో సిగ్నల్ ఇవ్వని కారణంగా ఒక స్టేషనుకుదూంరగా ఆగింది. అక్కడదింపేసాడు. తీరాచూస్తే అది విజయవాడ. మళ్ళీ వాళ్ళను వీళ్ళను అడిగి కదులుతున్న రైలు ఎక్కాను మళ్ళీ మంచి సీటు దొరికింది. అసలే రాత్రి కిటికీలోచి గాలి చల్లగా వీస్తూంటే నిద్రలోకి జారిపోయా. ఎదో స్టేషను వచ్చింది. ఒక అతను వచ్చి ఈ సీటు నాది లే అన్నాడు. ఇంతకీ ఇది ఏ స్టేషను అని అడిగా. గుంటూరు అని చెప్పాడు. గుంటూరు ఎందుకు వస్తుంది నే వెళ్ళే దారిలొ అని కదులుత్తున్న రైల్లోంచి దిగేసా. ఇంతలో మరో పాసింజరు రైలు వచ్చింది. చాలా ఖాలీగా వుంది రైలు. ఎక్కి కూర్చున్నా. ఏమైనా ప్రతీస్టేషను చుస్తుండాలి అనుకున్నా. కాని కునుపాట్లు. చాల శబ్దంతో పెట్టెలోకి ఎక్కుంతుంటే ఒకర్ని అడిగా ఇది ఏస్టేషను అని. బాపట్ల, రైలు తిరుపతి వెల్తుంది అన్నాడు. ఏమిచెయ్యాలో అర్థంకాలేదు. అక్కడ దిగాను, అవతల ఫ్లాట్ ఫారం మీద వెరేవైపుగా మరో రైలు కనిపించింది. ఫాట్ పారం దాటి అందులోకి ఎక్కాను. రైలు చాలా రద్దీగా వుంది. ఎక్కడా సీటు దొరకలేదు. డోరుదగ్గరే నిలబడ్డా. కొద్దిసేపటికి తెలవారటం మొదలయ్యింది. ఎక్కడున్నానా అని బయటకు చూస్తే గోదావరి బ్రిడ్జమీదనుంచి వెళుతుంది ట్రైన్. ఇంతలో గోదారి చూడాలని అందరూ గుమ్మం దగ్గరకు తోసుకు వచ్చారు. ఒక్కసారిగా తోసుకువచ్చేసరికి ట్రైనులోంచి బయటకు పడి పెద్దగా అరుచుకుంటూ గోదావరిలో పడ్డా.
ఏమయ్యిందండీ అంటూ నా ఆవిడ కుదిపి లేపింది.



.....ఆహ్! ఇది కలా!

Monday, November 12, 2007

అపుడెప్పుడో ఓ కలవచ్చింది.

అపుడెప్పుడో ఓ కలవచ్చింది.

ఏ వయస్సులో వచ్చిందో సరిగ్గా గుర్తుకు రావటంలేదు.

కల నెరవేరే సూచనలూ కనిపించటం లేదు.

కొత్తగూడెం వెళ్ళివస్తుంటే గుర్తుకొచ్చింది

ఇంతకీ కలేమిటంటే
భద్రాచలం నుండి పాపికొండ లను చుట్టి పోలవరం మీదుగా కొవ్వూరును కలుపుతూ రాజమండ్రికి రైలు మార్గాన్ని వేసినట్టు.

మా వూర్లోనే రైలు ఎక్కి రాజమండ్రి ప్రయాణించినట్టు
ఓ అద్బుతమైన
ఓ అందమైన ... కల
నెరవేరుతుందా
సాద్యమేనా??
ఎప్పుడు నెరవేరుతుంది???
చిత్రంగా వుందికదూ

Wednesday, November 7, 2007

కలలతో నా అనుబంధం

నా బాల్యంలో రెండు కలలు నిజం అవ్వటంతో నాకు కలలపై ప్రతేకమైన ఆశక్తి కలిగింది. రెండు కలలూ వేరువేరు సమయాలలోనివే అయినా రెండూ పరీక్షల నేపద్యమే. (అయినా ఆ వసు చదువుదే గదా)
1. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఒక కలవచ్చింది.క్వార్టర్లీ పరిక్షలకోసం సిద్దపడుతున్నప్పుడు కలలో ఓ ప్రశ్నాపత్రం కనిపించింది.అవే ప్రశ్నలు పరీక్ష రాసేటప్పుడు కనపడటం ఆశ్చర్యాన్ని లోనయ్యాను.
2. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మార్కులువేసిన సైన్సు పేపరులో 10 మర్కుల ప్రశ్నకు 8 మార్కులుయిచ్చి మళ్ళీ కొట్టివేశారు. కలలగురించి ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు అప్పటి ఆలోచనలేదు కాబట్టి మొడటికల బహుశ గుర్కు రాలేదు. కలవచ్చిన వెంటనే పెద్దగా గుర్తుపెట్టుకున్నదీ లేదు. అర్థసంవత్సర పరీక్షలు అయ్యి సంక్రాంతి శెలవులను బాగా గడిపిన తర్వాత ఒక్కొక్కటిగా ఇస్తున్నారు.సైన్సు పత్రాలు ఇచ్చే రోజు హాజరు పట్టీ క్రమంలో అందరివి ఇచ్చారు మద్యలో నాది లేదు. ఒకటే ఉత్కంట. అందరివి అయిపోయిన తర్వాత ప్రతేకకంగా మాష్టారు నన్ను పిలిచారు. నన్ను తనప్రక్కనే నిలబెట్టి జవాబుల పత్రాన్ని అందరికీ చూపిస్తున్నారు. పిల్లలందరికీ ఆశ్చరం ఏ ముందో ప్రత్యేకత అని, మార్కులువేసి ఎందుకు కొట్టివేసారా అని. నాకు ఆశ్చర్యం ఏమంటే కలో ఎలా చూసానో అలానే కనిపించింది. అది అక్సిజన్ తయారుచేసే విధానము, వివరణ బాగుంది, దస్తూరి బాగుంది, బొమ్మబాగుంది. ఇన్ని బాగుండేసరికి 10 మర్కుల ప్రశ్నకు 8 మార్కులు ఇచ్చారు కానీ మళ్ళీ పూర్తిగాచదివితే అందులో చిన్నపొరపాటు వుంది. దానివల్ల మొత్తం వ్యర్థమైపోయింది.అదేమంటే ఫార్ములా తప్పురాయటం.
ఇప్పటికీ ఆశ్చర్యం అలా ఎలా కలలునిజమౌతాయి

Tuesday, November 6, 2007

కల


కల

ఆనందాన్నిస్తుంది

లక్ష్యాన్నిస్తుంది

ఊరటనిస్తుంది

విహరింపచేస్తుంది

కన్నీళ్ళు పెట్టిస్తుంది

బ్రాంతిని కలుగచేస్తుంది

భయపెడుతుంది

రంగుల ఇంద్రధనస్సునిస్తుంది

హెచ్చరిస్తుంది

వెరసి...

జీవితాన్నిస్తుంది

కల కల కల - బ్లాగ్విషయం

బ్లాగ్విషయం

కల తెలుగు పదం
స్వప్నం సంస్కృత పదం

ఇంగ్లీషులో - డ్రీం అనే పదానికీ, విజన్ అనే పదానికీ తెలుగులో కల అనె వాడుకవుంది.
అబ్దుల్ కలాం కలలు కనండి కలలసహకారానికి కృషిచెయ్యమని చెపుతుంటారు.
ఇందులో విజన్ అనే పదమే ప్రధాన వుద్దేశం.

కల(విజన్) మానసికమైన, పరిశ్రమతో కూడుకున్నదిగా కనిపిస్తుంది. దూరదృష్టి, ప్రణాళిక, పరిశ్రమ, పట్టుదల, సహకారాలతో ముందుకు సాగల్సిన కృషి అవసరం.
ఈ కల వ్యక్తిగతం, కుటుంబం, సమాజికం ఇంకా వర్గం, ఇత్యాదులుగా వుంటుంది.

కల (డ్రీం) - ఏ వయసుకావయసుకు మారుతూనే వుంటాయి.

బాల్యం కంటే కలలు యౌవ్వనంలోనే ఎక్కువగా వస్తాయి.
యవ్వనమనేది వింత కలల సమాహారం. అర్థిక స్తితిగతులు ఎలావున్నా కలగనడం స్వాభావికమౌతాది.
వయసు మీద పడటంతో భాద్యతలు, బరువులు, పనివత్తిడులు పెరిగిపోయాక కలకనే కలగనే అంతః కోరిక మెల్లగా విశ్రాంతిలోనికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా దానికి వెసులుబాటు కలిగాక ఏ వయసులోనైనా కోరికై బయటికి వస్తుంది.

Monday, November 5, 2007

కల

లోకజ్ఞానం, ఆత్మజ్ఞానం వేరువేరుగా కొలవబడుతున్నప్పుడు కల కనలేని జీవితం శూన్యమనిపిస్తుంది. కల కనటం ఓ సాహసమనిపిస్తుంది. కలలేనిజీవితం రోడ్డుపై పడిన కాగితమైపోతుంది. వాహనాల తాకిడిలో ఎటుగాలివీస్తే అటు కొట్టుకుపోతుంది. బతుకు ప్రయాణంలో కలలు అలలు అలలుగా తేలిపోతుంటాయి. కలలంటే ఆశయాలు, ఆలోచనలతో కలిపి లోకంలోనో, అతఃలోకంలోనో భవిష్యకాలపు పొరల్లోకి తొంగిచూడటమే. ఏది కలో ఏది కదో కనుగొనటం కోసం పరికరాలను ఎవరికివారు కూర్చుకోవలసిందే. పుటంవేయబడిన కలలు గీటురాయికి నిలుస్తాయి.
కలకోసం, సాకారపు అడుగుల్లో అలసిన దేహంతో ఆద్మరచి నిదురిస్తున్నప్పుడు కలరాదు. కలతచెందిన అలోచనలమద్య కనుపాపలు చిక్కుకొని నిదురను దూరంచేస్తున్న దైన్యంలోనూ కలరాదు. దేహాన్ని సేదదీరుస్తున్న వాస్తవ, అవాస్తవాల నడుమ వూగుతున్నప్పుడు వెతుకులాటల వాస్తవాల దర్పణంలో ఎక్కణ్నుంచో ఏ జాములోనో రెప్పలపైవాలి చిత్రంగా నిలిచిపోతుంది, జీవితాన్ని మార్చివేస్తుంది.
కన్నకల సాకారం ఓ సాహసమనిపిస్తుంది. కనులు చూస్తున్నంతమేరా ముళ్ళదారులు, మిట్టపల్లాలు, ఎండమావులై వూరిస్తున్న ఎడారిదిబ్బలు, సడలించే పట్టుకోసం బాధించే ముళ్ళై పొడిచే మాటలు ఎదురుచూస్తుంటాయి. ఏ ఒక్కటీ సుళువుగా వదలదు. చేదించుకుంటూ సాగాల్సిందే.
కల కనటమంటే రాగద్వేషాల మద్య విభేదాన్ని భుజానికెత్తుకున్నట్టే. వెలివేయడనికో, అమ్మేయడానికో మనల్ని మనం అప్పగించుకున్నట్టే. అయినా నియమింపబడిన దారెపుడో పునాదులు తవ్వి విజయపథం పరచబడుతుంది. నడకేమీ సులభం కాదు. పిడచకట్టుకుంటున్న నాలికైనా కలను నెమెరెయాల్సిందే.
ఎన్నడూ దున్నని భూమిలో మొలకలు దర్శించడం లోకులకు వెర్రితనంగా కంపిస్తుంది. వెన్నొంగిన పంటను కోసేందుకు కదిలే కూలీలు పనలనుమోస్తూ
పాడే పాటలలో కన్నీటి కష్టమేదో దాగివుంటుంది. పనలనుదులిపి విత్తనాలుగానో రోట్టెగానో రూపాతరం చెందుతుంది.
"నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును... మీ ముసలివారు కలలు కందురు, మీ యౌవనస్థులు దర్శ్నములు చూతురు" యోవేలు 2:28(బైబిలు)

Sunday, November 4, 2007

కల" అనేకాంశాలతో నాకు చాలా అనుబంధంవుంది.

కల" అనేకాంశాలతో నాకు చాలా అనుబంధంవుంది.
కలను బ్లాగమన్నవారికి నెనరులు"కల" అనేకాంశాలతో నాకు చాలా అనుబంధంవుంది.నా నిద్రలో కలలునా యవన కాలపు కలలునా జీవిత కలలు ... ఒక భాగమైతేకలలు ఎలావస్తాయనే ప్రశ్నశాస్త్రీయ విశ్లేషణలుఅద్యాత్మిక విశ్లేషణలు (బైబిలులో కలలకు చాలా .. మరొక భాగమైతేకలలు కనమనివాటిని వాస్తవీకరించుకోడానికి కృషిచేయమనే "అబ్దుల్ కలాం"చాలావిషయాలు నాలో ఒక్కసారిగా పొంగుకొస్తున్నాయి.కానీ సమయమే సరిపోవటంలేదుఎదో ఉడతా భక్తిగా నా ప్రయత్నం.