ఇంగ్లీషులో - డ్రీం అనే పదానికీ, విజన్ అనే పదానికీ తెలుగులో కల అనె వాడుకవుంది. అబ్దుల్ కలాం కలలు కనండి కలలసహకారానికి కృషిచెయ్యమని చెపుతుంటారు. ఇందులో విజన్ అనే పదమే ప్రధాన వుద్దేశం.
కల(విజన్) మానసికమైన, పరిశ్రమతో కూడుకున్నదిగా కనిపిస్తుంది. దూరదృష్టి, ప్రణాళిక, పరిశ్రమ, పట్టుదల, సహకారాలతో ముందుకు సాగల్సిన కృషి అవసరం. ఈ కల వ్యక్తిగతం, కుటుంబం, సమాజికం ఇంకా వర్గం, ఇత్యాదులుగా వుంటుంది.
కల (డ్రీం) - ఏ వయసుకావయసుకు మారుతూనే వుంటాయి.
బాల్యం కంటే కలలు యౌవ్వనంలోనే ఎక్కువగా వస్తాయి. యవ్వనమనేది వింత కలల సమాహారం. అర్థిక స్తితిగతులు ఎలావున్నా కలగనడం స్వాభావికమౌతాది. వయసు మీద పడటంతో భాద్యతలు, బరువులు, పనివత్తిడులు పెరిగిపోయాక కలకనే కలగనే అంతః కోరిక మెల్లగా విశ్రాంతిలోనికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా దానికి వెసులుబాటు కలిగాక ఏ వయసులోనైనా కోరికై బయటికి వస్తుంది.