Wednesday, April 30, 2008

ఈత బ్లాగ్విషయం 2


ఈత - బ్లాగ్విషయం
బహుశ నా 8-9 సంవత్సరాల వయస్సులో మొదటిసారి ఈతకోసం ప్రయత్నించిన గుర్తు.
గోదావరి నదిలొనే నా ఈతకుశ్రీకారం చుట్టాను. కొరుటూరు, టేకూరు, కొండమొదలు, పోలవరం, పట్టిసీమ, కొవ్వూరు, కొత్తపేట, రాజమండ్రి, ఔరంగబాద ఇవి నేను ఈతకొట్టిన రేవులు. ఒక స్థలానికీ ఇంకొకస్థలానికీ మద్య పోలికలు, అనుభవాలు వేరువేరుగా వున్నాయి.
పోలవరంలో విద్యాభ్యాసం జరిగినంతకాలం ప్రతీరోజూ గోదావరిలో స్నానంచేయడం, స్నానాకి వెళ్ళవద్దు అని ఇంటిలోనివాళ్ళు నిర్భందిస్తే కావిడతీసుకొని, నీళ్ళుతెస్తానని ఒంకపెట్టడం అలవాటయ్యింది
వేసవి లేదా ఎండగా వున్న రోజులలో ఎప్పుడు స్కూలు అయిపోతుందా, ఎప్పుడు ఎందకొంచెం తగ్గుతుందా అని ఎదురుచూసిన సందర్భాలు చాలావున్నాయి.
గోదావరిరేవుకు వెళ్లినతర్వాత, కేరింతలు, నీళ్ళలోనే ఈదుతూ దాగుదుమూతలు, అప్పుడప్పుడు పల్లెవాళ్ళు(చేపలు పట్టే) వారి పడవలను తోసుకువెళ్ళి ఆవలి వైపుకు వెళ్ళడం జరిగేవి. ఇలా ఆదుకొన్న రోజులు బహుశ 6-8 తరగతి వయస్సు మరియు స్నేహితులు వుండేవారు.
ఈ బ్లాగు కోసం వారిని ఒకొక్కరిని గుర్తుచేసుకున్నాను
నాగేశ్వరర్రావు, తూము రమచంద్రరావు, భాషా, కాగితాల రాంబాబు, సుబ్బారావు వీరుమాత్రమే గుర్కువచ్చారు.
నేను ఒకఒమ్మాయికి ఈతనేర్పడం మా సమూహంలో చంచలన విషయం. ఆ అమ్మాయి నేను అప్పటికి 8వ తరగతి చదివేవాళ్ళం.
నేను ఈతకొడుతూ ఎవరినీ రక్షించిన జ్ఞాపకాలు లేవుగాని, అప్పుడప్పుడు నీళ్ళకోసం వచ్చిన వారి బిందెలు కడుగుతున్నప్పుడు ప్రవాహానికి కొట్టుకపోయేవి, చూస్తుండగానే లోతులోకో, దూరంగానో వెళ్ళిపోయేవి. అలాంటి సమయంలో వాటిని(ఈదుకొని) తెచ్చిన గుర్తులు రెండో మూడొ ఇంకా ఎక్కువో వుండవచ్చు.
ఒకేరేవులో స్నానం చేస్తూనో ఈతకొడుతూనో వుండటంవల్ల దాని లోతు పాతులు, సుడులు తెలిసి జాగ్రత్తగా వుండేవాళ్ళం. అయినా అప్పుడూ రెవులో స్నానచేస్తూ కొట్తుకుపోయిన, మునిగిపోయిన సంఘటనలు జరిగేవి. అలాంటప్పుడు కొన్నిరోజులు మా బాచ్‌పై గోదావరికి వెళ్ళకుండా నిఘా వుండేది.
అప్పుడే మునుగీత, బారలు, వనుకకు ఈదడం(బాక్ స్త్రొక్), ములిగితేలుతూ (బట్తర్ ప్లై) , నిలువు ఈత, ఒకేచోట నీళ్ళపై తేలివుండటం, ఇలా కొన్ని రకాలు నేర్చుకొనటం జరిగింది

....... తర్వాత టపాలో మరికొన్ని