
నేను పోలవరంలొ హైస్కూలు చదువుతున్న రోజుల్లో ప్రతీరోజూ గోదావరిలో ఈత, స్నానం, ఆటలు జరిగేవి.
ఓ రోజు లాంచీల రేవులోకొందరు మిత్రులు ఈదుతూ కొంత దూరంలో నిలబడి ఇక్కడలోతు తక్కువగా వుంది రా అని పిలచారు. నిజానికి లాంచీలరేవు లోతుగా వుంటుంది. నేను రాను బజారు రేవుకు(ఆలవాటైనది, రోజూవెళ్ళేది) పోతాను అన్నాను. కానీ స్నేహితులు పిలచేసరికి దిగాను. కొద్దిదూరం ఈదగానే ఒక్కసారిగా మునిగిపోవటం జరిగింది. మొఖానికి వంటికి ఏదో నాచు లాంటిది మెత్తగా తగిలింది. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఎలాగో తెగించి పైకిలేచాను. ఒక్క దమ్ము ఊపిరి తీసుకోగానే అర్థం అయ్యింది నేను సుడిలో పడ్డానని. నా బలాన్ని అంతా వుపయోగించి తపతపా కొట్టుకున్నాను. ఎలాగో బటపడ్డాను. ఒడ్డుకుచేరి కొద్దిసేపు తెప్పరిల్లాను, నన్ను పిలుస్తున్న నా మిత్రులు నేను కొత్త పల్టీలు కొడుతున్నా నని నవ్వుతున్నారు. తీరా విషయం తెలిసాక వాళ్ళుకూడా ఆరేవులోకి మళ్ళీ వెళ్ళలేదు. ఒక రకంకంగా చావు తప్పి బ్రతికాననిపిస్తుంది.