Wednesday, April 30, 2008
ఈత బ్లాగ్విషయం 2
ఈత - బ్లాగ్విషయం
బహుశ నా 8-9 సంవత్సరాల వయస్సులో మొదటిసారి ఈతకోసం ప్రయత్నించిన గుర్తు.
గోదావరి నదిలొనే నా ఈతకుశ్రీకారం చుట్టాను. కొరుటూరు, టేకూరు, కొండమొదలు, పోలవరం, పట్టిసీమ, కొవ్వూరు, కొత్తపేట, రాజమండ్రి, ఔరంగబాద ఇవి నేను ఈతకొట్టిన రేవులు. ఒక స్థలానికీ ఇంకొకస్థలానికీ మద్య పోలికలు, అనుభవాలు వేరువేరుగా వున్నాయి.
పోలవరంలో విద్యాభ్యాసం జరిగినంతకాలం ప్రతీరోజూ గోదావరిలో స్నానంచేయడం, స్నానాకి వెళ్ళవద్దు అని ఇంటిలోనివాళ్ళు నిర్భందిస్తే కావిడతీసుకొని, నీళ్ళుతెస్తానని ఒంకపెట్టడం అలవాటయ్యింది
వేసవి లేదా ఎండగా వున్న రోజులలో ఎప్పుడు స్కూలు అయిపోతుందా, ఎప్పుడు ఎందకొంచెం తగ్గుతుందా అని ఎదురుచూసిన సందర్భాలు చాలావున్నాయి.
గోదావరిరేవుకు వెళ్లినతర్వాత, కేరింతలు, నీళ్ళలోనే ఈదుతూ దాగుదుమూతలు, అప్పుడప్పుడు పల్లెవాళ్ళు(చేపలు పట్టే) వారి పడవలను తోసుకువెళ్ళి ఆవలి వైపుకు వెళ్ళడం జరిగేవి. ఇలా ఆదుకొన్న రోజులు బహుశ 6-8 తరగతి వయస్సు మరియు స్నేహితులు వుండేవారు.
ఈ బ్లాగు కోసం వారిని ఒకొక్కరిని గుర్తుచేసుకున్నాను
నాగేశ్వరర్రావు, తూము రమచంద్రరావు, భాషా, కాగితాల రాంబాబు, సుబ్బారావు వీరుమాత్రమే గుర్కువచ్చారు.
నేను ఒకఒమ్మాయికి ఈతనేర్పడం మా సమూహంలో చంచలన విషయం. ఆ అమ్మాయి నేను అప్పటికి 8వ తరగతి చదివేవాళ్ళం.
నేను ఈతకొడుతూ ఎవరినీ రక్షించిన జ్ఞాపకాలు లేవుగాని, అప్పుడప్పుడు నీళ్ళకోసం వచ్చిన వారి బిందెలు కడుగుతున్నప్పుడు ప్రవాహానికి కొట్టుకపోయేవి, చూస్తుండగానే లోతులోకో, దూరంగానో వెళ్ళిపోయేవి. అలాంటి సమయంలో వాటిని(ఈదుకొని) తెచ్చిన గుర్తులు రెండో మూడొ ఇంకా ఎక్కువో వుండవచ్చు.
ఒకేరేవులో స్నానం చేస్తూనో ఈతకొడుతూనో వుండటంవల్ల దాని లోతు పాతులు, సుడులు తెలిసి జాగ్రత్తగా వుండేవాళ్ళం. అయినా అప్పుడూ రెవులో స్నానచేస్తూ కొట్తుకుపోయిన, మునిగిపోయిన సంఘటనలు జరిగేవి. అలాంటప్పుడు కొన్నిరోజులు మా బాచ్‌పై గోదావరికి వెళ్ళకుండా నిఘా వుండేది.
అప్పుడే మునుగీత, బారలు, వనుకకు ఈదడం(బాక్ స్త్రొక్), ములిగితేలుతూ (బట్తర్ ప్లై) , నిలువు ఈత, ఒకేచోట నీళ్ళపై తేలివుండటం, ఇలా కొన్ని రకాలు నేర్చుకొనటం జరిగింది
....... తర్వాత టపాలో మరికొన్ని
Sunday, April 27, 2008
ఈత - బ్లాగ్విషయం
ఈత గురించి నాకు తెలిసినది చెప్పి తర్వాత నా అనుభవాలు చెపుతాను.
ఈత స్థలాలు :
సముద్రం, నది, కాలువ, చెఱువు, బావి, దిగుడు బావి ఇవి సహజ స్థలాలు.
సహజమైన స్థలాలు ఎప్పుడూ ఒకేరకమైన లోతులు వుండవు. ఒక్కోటి ఒక్కోవిధంగా వుంటుంది.
నది, కాలువలలో ప్రవాహం వుంటుంది.
అంతే కాకుండా సుడులు, గుంతలు వుండి ప్రమాద కారకాలు అవుతుంటాయి.
సముద్రంలో ఈతకొట్టడానికి అలలను గుర్తించాల్సిన అవసరం వుంటుంది.
భౌగోళిక పరిస్థితులను బట్టి సముద్రతీరాలు(బీచ్) వుంటాయి.
దాన్ని బట్టే లోతులు వుంటాయి.
ఉదాహరణికి : కాకినాడ బీచ్ - వాలుగా వుండటం వల్ల లోతు ఒకచూటుకి ఇంకొకచోటుకీ తేడా వుంటుంది.
అదే మంగినపూడి(మచిలీపట్నం) బీచ్ లోపలికి ఎంతవెళ్ళినా లోతువుండదు.
బాపట్ల(సూర్యలంక) పైరెండిటికీ మద్యలొ వుంటుంది
చెఱువు, బావి, దిగుడు బావులలో లోతును గమనించి నిలువుగా నీటిపై తేలివుండాల్సిన అవసరం. (వేగవంతంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి కనుమరుగైపోతున్నాయి)
ఈతకొలను (స్విమ్మింగ్‌పూల్) కృత్రిమమైనది.
శాస్త్రీయంగా ఈతల రకాలు నాకు తెలియవు గానీ నెను నేర్చు కున్నవి కొన్ని చెబుతాను.
బహుశ నా 8-9 సంవత్సరాల వయసప్పుడు మొదటిసారి గోదావరిలో దిగి మావయ్య ఆనందరావు సహాయంతో ఈతపేరుతో తపతప కొట్టుకున్న గుర్తు.
మరికొన్ని వివరాలు తర్వాత టపాలో...
Wednesday, April 23, 2008
బ్లాగ్విషయం - గ్రంధాలయం - నా జ్ఞాపకాలు, అనుభవాలు
పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం గ్రామం, 1970 -72 సంవత్సరాలమద్య 6- 7 తరగతులు చదివేటప్పుడు గ్రంధాలయం పరిచయమయ్యింది. అప్పట్లో చందమామ, విజయచిత్ర, సినిమారంగం సోవియెట్‌భూమి పత్రికలు పరిచయమయ్యాయి. అప్పటిలోనే నవలలు ఎక్కువగా చదివే వారు. మా కాలనీలో కొంతమంది నాకంటే పెద్దవారు తరచూ నవలలు చదవటం, ఒకరి పుస్తకాలను ఒకరు ఇచ్చిపుచ్చుకోవటం జరిగేది. ఆ కార్యక్రమమంలో నేను వార్తాహరుడిగా దూరే వాణ్ణి. వారితో తోడుగా వెళ్ళి వాళ్ళు నవలలు వెతుక్కొనేలోపు విజయచిత్రను తిరగెయ్యటం, చందమామలో ఒక కథ చదవడం, వేరేవారు చుదువుతుంటే దానికోసం నిరీక్షించడం లీలగా గుర్తుకొస్తున్నాయి. ఇక్కడే నాటకాలతో పరిచయం ఏర్పడింది. కృష్ణమూర్తి గారని మా ఇంటి ప్రక్కన వుండే వారు. (ఆయన అప్పటిలో నాటకాలు వేసేవారు. తర్వాత చాలా సినిమాలలో జడ్జి పాత్రలు వేయడం వల్ల జడ్జి కృష్ణమూర్తిగా ఇప్పటికి నటిస్తున్నారు.)ఈ లైబ్రరీలోని ఒక రూములో రిహార్సల్సు జరిగేవి. అప్పటికే నా దస్తూరి బాగుండటంవలన స్క్రిప్టు రాయించుకోవడానికి అప్పుడప్పుడూ తీసుకువెళ్ళేవారు. ఆవూరిలో వున్న ఎన్.జి.వోలు అందరూ కలసి తరచూ నాటకాలు వేస్తుండేవారు. వారికి స్క్రిప్టుతో పాటు నీళ్ళు, సిగరెట్లు, ఫలహారాలు అందించిన గుర్తు. ఆ సమయంలోనే "కర్ణ" ఏక పాత్రాభినయం కంఠతా పట్టిన గుర్తు. ఇంటరు చదివే రోజుల్లో శెలవలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడూ వెళ్ళిన గుర్తు. ఖచ్చితంగా ఏ పుస్తకాలు చదివానో గుర్తు రావటంలేదు.1986 గోదావరి వరదలలో లైబ్రెరీ బాగా దెబ్బతిందని విన్నాను, అంతే కాదు భవనం కూడా మారింది. చాలా సార్లు పోలవరం వెళ్లినా గ్రంధాలయానికి వెళ్ళిన గుర్తు లేదు.
Tuesday, April 22, 2008
బ్లాగ్విషయం .. నేను .. నా గ్రంధాలయం
అప్పుడప్పుడు నా ప్రక్కటెముకకు కోపమొచ్చినప్పుడు మనలో(క్రైస్తవులలో) పార్థివ దేహాన్ని తగలుబెట్టరుకదా ఇన్ని పుస్తకాలు ఎందుకు? తగలెబెడితే సగం కట్తెలఖర్చు అయినా తప్పుతుంది అంటూ అంటుంది. అలా నా ప్రక్కటెముకతో పోట్లాడినప్పుడల్లా వారపత్రికలనుండి వివిధ పత్రికలనుండి సేకరించినవి దాచుకోలేక పాత కాగితాలవాడికి ఇచ్చివేసిన సందర్భాలు చాల వున్నాయి.
నేను హైదరాబాదు వచ్చిన కొత్తలో రావుగారని సంజీవరెడ్డి నగర్‌లో వుండేవారు. ఆయనది సొంత ఇల్లు కావటంవల్ల, మావూరి వారు కావటం వల్ల నాలాంటి కుర్రవాళ్ళకి తపలా చిరునామాగా వుండేది. ఆయన భార్య అనుకోని ప్రమాదంలో చనిపోవటం వల్ల చిన్న పిల్లగా వున్న కూతురిని చూసుకుంటూ వేదాంతానికి సంబందించిన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అందులో క్రైస్తవ వేదాంతానికి సంబందించి ఎక్కువగా వుండేవి. నాకు తెలిసీ తెలియని జ్ఞానంతో ఎవోసంగతులను వాదించేవాడిని. చాలా నెమ్మదిగా నకు తెలియచెప్పేవారు. తన అల్మారాలో వున్న పుస్తకాలు అక్కడ కూర్చిని చదవటానికి మాత్రమే అనుమతిచ్చేవారు. రూముకు పట్టుకేళితే తిరిగివస్తుందొ లేదోనని ఆయన అనుమానం.
నేను అటూ ఇటూ తిరిగి (బహుశ ఐదు, ఆరు సంవత్సరాలతర్వాత) ఆయనను పలకరిద్దామని వెళ్ళాను. ఈ మద్యకాలంలో ఆయన మళ్ళీ పెళ్ళిచేసుకున్నారు. నేను వెళ్ళే సరికి వరండాలో చిందరవందరగా పుస్తకాలు పడివున్నాయి, ఏమిటా సంగతి అని ఆరాతీస్తే తెలిసింది పాత పుస్తకాలవాడికి అమ్మేస్తున్నారని. మనసు చివుక్కుమంది. వద్దని వారించాను. ఏమిజరిగిందో కాని నిర్ణయం మార్చుకోలేదు. నీకు ఒపికవుంటే నువ్వు పట్తుకపో ఎప్పుడైనా చూడాలనిపిస్తే నీ దగ్గరకు వస్తాలే అన్నారు. సరేనని బేరం చెడగొట్తినందుకు పాతకాగితాలవాడు నన్ను బాగానే తిట్తుకున్నాడు. అయినా ఎదొలా అవస్తపడి గోనె సంచుల్లో నింపుకొని ఇంటికి తెచ్చుకున్నను. అప్పటినుండి నాకు ఇల్లు మారడంటే పెద్ద కష్టంగా వుండేది. మారినప్పుడల్లా నేను, నా ప్రక్కటెముక తగువులాడుకోవడం మాములే! కాని ఆయన మళ్ళీ నన్ను గాని, ఆయ్నిచ్చిన నా పుస్తకాలు గాని చూడాటానికి రాలేదు. బహుశ ఇప్పటికి 17 సంవత్సరాలు గడచాయనుకుంటా.
నేను సాహిత్యంలో పడ్డప్పటినుంచీ కొన్ని పుస్తకాలు ఒకొక్కటిగా చేరటం మొదలయ్యింది. ఇప్పుడు అద్దె ఇల్లు మారాలంటే ప్రధాన సమస్య పుస్తకాలే. చిన్న గ్రందాలయపు గది వుంచుకోవాలని చిన్న జీవిత కాలపు కోరిక కూడా. సాహిత్యంలో ప్రధానంగా కవిత్వమే వుంటుంది.

బ్లాగ్విషయం - గ్రంధాలయం
avigaa తన అభిమానించిన పుస్తకాలను దాచుకోవడంతో మొదలుపెట్టిన శ్రీ రాజు, మిత్రులు సాహితీప్రియుల మద్య కవిరాజుగా సుపరిచుతుడై తను సేకరించిన పుస్తకాలకోసం తన ఇంటి మొదటి అంతస్తు మొత్తాన్ని కేటాయించారు. అక్కడ ఇప్పుడు తరచూ సాహిత్య చర్చలు, సమావేసాలు జరుగుతున్నాయి.
చాలా ప్రాచీన, నూతన గ్రంధాలు ఇక్కడ వున్నాయి
గ్రందాలయానికి అందరికీ అహ్వానం వుంది
చిరునామా
నాగేశ్వరి కవిరాజు అక్షరాలయం
5-7-37, సంగీత్ నగర్,
కుకట్‌పల్లి, హైదరాబాదు. పోను : 040-23066444
మీరు దగ్గరలోవుంటే ఒకసారి దర్శించండి

Subscribe to:
Posts (Atom)