Tuesday, April 22, 2008

బ్లాగ్విషయం .. నేను .. నా గ్రంధాలయం

అప్పుడప్పుడు నా ప్రక్కటెముకకు కోపమొచ్చినప్పుడు మనలో(క్రైస్తవులలో) పార్థివ దేహాన్ని తగలుబెట్టరుకదా ఇన్ని పుస్తకాలు ఎందుకు? తగలెబెడితే సగం కట్తెలఖర్చు అయినా తప్పుతుంది అంటూ అంటుంది. అలా నా ప్రక్కటెముకతో పోట్లాడినప్పుడల్లా వారపత్రికలనుండి వివిధ పత్రికలనుండి సేకరించినవి దాచుకోలేక పాత కాగితాలవాడికి ఇచ్చివేసిన సందర్భాలు చాల వున్నాయి.
నేను హైదరాబాదు వచ్చిన కొత్తలో రావుగారని సంజీవరెడ్డి నగర్‌లో వుండేవారు. ఆయనది సొంత ఇల్లు కావటంవల్ల, మావూరి వారు కావటం వల్ల నాలాంటి కుర్రవాళ్ళకి తపలా చిరునామాగా వుండేది. ఆయన భార్య అనుకోని ప్రమాదంలో చనిపోవటం వల్ల చిన్న పిల్లగా వున్న కూతురిని చూసుకుంటూ వేదాంతానికి సంబందించిన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అందులో క్రైస్తవ వేదాంతానికి సంబందించి ఎక్కువగా వుండేవి. నాకు తెలిసీ తెలియని జ్ఞానంతో ఎవోసంగతులను వాదించేవాడిని. చాలా నెమ్మదిగా నకు తెలియచెప్పేవారు. తన అల్మారాలో వున్న పుస్తకాలు అక్కడ కూర్చిని చదవటానికి మాత్రమే అనుమతిచ్చేవారు. రూముకు పట్టుకేళితే తిరిగివస్తుందొ లేదోనని ఆయన అనుమానం.
నేను అటూ ఇటూ తిరిగి (బహుశ ఐదు, ఆరు సంవత్సరాలతర్వాత) ఆయనను పలకరిద్దామని వెళ్ళాను. ఈ మద్యకాలంలో ఆయన మళ్ళీ పెళ్ళిచేసుకున్నారు. నేను వెళ్ళే సరికి వరండాలో చిందరవందరగా పుస్తకాలు పడివున్నాయి, ఏమిటా సంగతి అని ఆరాతీస్తే తెలిసింది పాత పుస్తకాలవాడికి అమ్మేస్తున్నారని. మనసు చివుక్కుమంది. వద్దని వారించాను. ఏమిజరిగిందో కాని నిర్ణయం మార్చుకోలేదు. నీకు ఒపికవుంటే నువ్వు పట్తుకపో ఎప్పుడైనా చూడాలనిపిస్తే నీ దగ్గరకు వస్తాలే అన్నారు. సరేనని బేరం చెడగొట్తినందుకు పాతకాగితాలవాడు నన్ను బాగానే తిట్తుకున్నాడు. అయినా ఎదొలా అవస్తపడి గోనె సంచుల్లో నింపుకొని ఇంటికి తెచ్చుకున్నను. అప్పటినుండి నాకు ఇల్లు మారడంటే పెద్ద కష్టంగా వుండేది. మారినప్పుడల్లా నేను, నా ప్రక్కటెముక తగువులాడుకోవడం మాములే! కాని ఆయన మళ్ళీ నన్ను గాని, ఆయ్నిచ్చిన నా పుస్తకాలు గాని చూడాటానికి రాలేదు. బహుశ ఇప్పటికి 17 సంవత్సరాలు గడచాయనుకుంటా.
నేను సాహిత్యంలో పడ్డప్పటినుంచీ కొన్ని పుస్తకాలు ఒకొక్కటిగా చేరటం మొదలయ్యింది. ఇప్పుడు అద్దె ఇల్లు మారాలంటే ప్రధాన సమస్య పుస్తకాలే. చిన్న గ్రందాలయపు గది వుంచుకోవాలని చిన్న జీవిత కాలపు కోరిక కూడా. సాహిత్యంలో ప్రధానంగా కవిత్వమే వుంటుంది.

బ్లాగ్విషయం - గ్రంధాలయం

avigaa తన అభిమానించిన పుస్తకాలను దాచుకోవడంతో మొదలుపెట్టిన శ్రీ రాజు, మిత్రులు సాహితీప్రియుల మద్య కవిరాజుగా సుపరిచుతుడై తను సేకరించిన పుస్తకాలకోసం తన ఇంటి మొదటి అంతస్తు మొత్తాన్ని కేటాయించారు. అక్కడ ఇప్పుడు తరచూ సాహిత్య చర్చలు, సమావేసాలు జరుగుతున్నాయి.
చాలా ప్రాచీన, నూతన గ్రంధాలు ఇక్కడ వున్నాయి
గ్రందాలయానికి అందరికీ అహ్వానం వుంది
చిరునామా
నాగేశ్వరి కవిరాజు అక్షరాలయం
5-7-37, సంగీత్ నగర్,
కుకట్‌పల్లి, హైదరాబాదు. పోను : 040-23066444
మీరు దగ్గరలోవుంటే ఒకసారి దర్శించండి

Monday, January 7, 2008

బ్లాగ్విషయం - పాట నేను రాసిన పాటలు - 1

ఎదురుచూపుల తలపులు
ఎదురుచూసా ప్రతిక్షణం
వూహలవేగంతో ఎగిరొస్తావని
కనులలో కదిలే
కలలకే రూపం యిస్తావని

విడివడిపోయిన ముంగురులు
పడిగాపుల చూపులు
విసిగి వేసారి
నిట్టూర్పుల సెగలైపోవగ

ముంగురులనే సవరించ
మోముపై కదలాడిన వేలికొనలు
గిలిగింతలై నడయాడేనని
ఎదురుచూసా

సతమతమయ్యే పనులు
మది కలచే గిరులు
నిలచి కలచి కుతకుతలాడగ
కదులుతుంటే

వూతమిచ్చే మోతాదుగా
చెవిలో పలికే పలుకులై
మూటల ధైర్యమయ్యేనని
ఎదురుచూసా

Friday, December 28, 2007

బ్లాగ్విషయం - పాట

బ్లాగ్విషయం - పాట
పాట జీవితంలో అంతః భాగము.
పాటలను గురించి రాయాలంటే నా జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. వయసును బట్టి, వాతావరణాన్ని బట్టి, పరిసరాల ప్రభావన్ని బట్టి పాటల అభిరుచి మారుతూనే వుంది.

జానపద పాటలు
లలితగీతాలు
భక్తిగీతాలు
సినీగీతాలు
- సినీ భక్తి గీతాలు
- దేశ భక్తి గీతాలు
- యుగళగీతాలు
- విషాద గీతాలు
- హాస్య గీతాలు
- పాత్రోచిత పాటలు
- ప్రత్యేక సమయాల పాటలు
- పెళ్ళి పాటలు
- సాంప్రదాయ పాటలు
- క్లబ్బు పాటలు
ఇలా.. ఇలా.. అనంతమైన లిస్టు

Tuesday, November 20, 2007

.....ఆహ్! ఇది కలా!

అది సాయంకాలం 6.00 గంటలసమయం అర్జంటుగా కాగజ్ నగర్ వెళ్ళమని మాబాసునుంచి ఫోను వచ్చింది. ఆలస్యం చెయ్యకుండా సికింద్రాబాదు ఉరుకులు పరుగులమీద వెళ్ళాను. అక్కడవున్న టిటిని అడిగాను ఏ రైలు ఎక్కాలి అని. 1వ నంబరు ఫ్లాటుఫారంమీద ట్రైను వుంది త్వరగా వెళ్ళు అన్నాడు. ఫ్ళాటఫ్హరంమీదకు వెళ్ళే సరికి ట్రైన్ కదులుతూ కనిపించింది. పరుగెత్తి దొరికిన డోర్ లో ఎక్కేసాను. బోగీ చాలా ఖాళీగావుంది. పైబెర్తుపై చోటుచేసుకొని పడుకున్నను. ఎంతసేపు నిద్రపొయానో తెలియదు టిటి.నంటూ నిద్రలేపి టికెట్టు అడిగాడు, చూపించాను. నావంక ఎగాదిగాచూసి ఇది ఎ.పి. ఎక్స్ ప్రెస్స్ వెళ్ళదు కాబట్టి దిగిపో అనిచెప్పాడు. కొద్దిసేపట్లో సిగ్నల్ ఇవ్వని కారణంగా ఒక స్టేషనుకుదూంరగా ఆగింది. అక్కడదింపేసాడు. తీరాచూస్తే అది విజయవాడ. మళ్ళీ వాళ్ళను వీళ్ళను అడిగి కదులుతున్న రైలు ఎక్కాను మళ్ళీ మంచి సీటు దొరికింది. అసలే రాత్రి కిటికీలోచి గాలి చల్లగా వీస్తూంటే నిద్రలోకి జారిపోయా. ఎదో స్టేషను వచ్చింది. ఒక అతను వచ్చి ఈ సీటు నాది లే అన్నాడు. ఇంతకీ ఇది ఏ స్టేషను అని అడిగా. గుంటూరు అని చెప్పాడు. గుంటూరు ఎందుకు వస్తుంది నే వెళ్ళే దారిలొ అని కదులుత్తున్న రైల్లోంచి దిగేసా. ఇంతలో మరో పాసింజరు రైలు వచ్చింది. చాలా ఖాలీగా వుంది రైలు. ఎక్కి కూర్చున్నా. ఏమైనా ప్రతీస్టేషను చుస్తుండాలి అనుకున్నా. కాని కునుపాట్లు. చాల శబ్దంతో పెట్టెలోకి ఎక్కుంతుంటే ఒకర్ని అడిగా ఇది ఏస్టేషను అని. బాపట్ల, రైలు తిరుపతి వెల్తుంది అన్నాడు. ఏమిచెయ్యాలో అర్థంకాలేదు. అక్కడ దిగాను, అవతల ఫ్లాట్ ఫారం మీద వెరేవైపుగా మరో రైలు కనిపించింది. ఫాట్ పారం దాటి అందులోకి ఎక్కాను. రైలు చాలా రద్దీగా వుంది. ఎక్కడా సీటు దొరకలేదు. డోరుదగ్గరే నిలబడ్డా. కొద్దిసేపటికి తెలవారటం మొదలయ్యింది. ఎక్కడున్నానా అని బయటకు చూస్తే గోదావరి బ్రిడ్జమీదనుంచి వెళుతుంది ట్రైన్. ఇంతలో గోదారి చూడాలని అందరూ గుమ్మం దగ్గరకు తోసుకు వచ్చారు. ఒక్కసారిగా తోసుకువచ్చేసరికి ట్రైనులోంచి బయటకు పడి పెద్దగా అరుచుకుంటూ గోదావరిలో పడ్డా.
ఏమయ్యిందండీ అంటూ నా ఆవిడ కుదిపి లేపింది.



.....ఆహ్! ఇది కలా!

Monday, November 12, 2007

అపుడెప్పుడో ఓ కలవచ్చింది.

అపుడెప్పుడో ఓ కలవచ్చింది.

ఏ వయస్సులో వచ్చిందో సరిగ్గా గుర్తుకు రావటంలేదు.

కల నెరవేరే సూచనలూ కనిపించటం లేదు.

కొత్తగూడెం వెళ్ళివస్తుంటే గుర్తుకొచ్చింది

ఇంతకీ కలేమిటంటే
భద్రాచలం నుండి పాపికొండ లను చుట్టి పోలవరం మీదుగా కొవ్వూరును కలుపుతూ రాజమండ్రికి రైలు మార్గాన్ని వేసినట్టు.

మా వూర్లోనే రైలు ఎక్కి రాజమండ్రి ప్రయాణించినట్టు
ఓ అద్బుతమైన
ఓ అందమైన ... కల
నెరవేరుతుందా
సాద్యమేనా??
ఎప్పుడు నెరవేరుతుంది???
చిత్రంగా వుందికదూ

Wednesday, November 7, 2007

కలలతో నా అనుబంధం

నా బాల్యంలో రెండు కలలు నిజం అవ్వటంతో నాకు కలలపై ప్రతేకమైన ఆశక్తి కలిగింది. రెండు కలలూ వేరువేరు సమయాలలోనివే అయినా రెండూ పరీక్షల నేపద్యమే. (అయినా ఆ వసు చదువుదే గదా)
1. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఒక కలవచ్చింది.క్వార్టర్లీ పరిక్షలకోసం సిద్దపడుతున్నప్పుడు కలలో ఓ ప్రశ్నాపత్రం కనిపించింది.అవే ప్రశ్నలు పరీక్ష రాసేటప్పుడు కనపడటం ఆశ్చర్యాన్ని లోనయ్యాను.
2. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మార్కులువేసిన సైన్సు పేపరులో 10 మర్కుల ప్రశ్నకు 8 మార్కులుయిచ్చి మళ్ళీ కొట్టివేశారు. కలలగురించి ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు అప్పటి ఆలోచనలేదు కాబట్టి మొడటికల బహుశ గుర్కు రాలేదు. కలవచ్చిన వెంటనే పెద్దగా గుర్తుపెట్టుకున్నదీ లేదు. అర్థసంవత్సర పరీక్షలు అయ్యి సంక్రాంతి శెలవులను బాగా గడిపిన తర్వాత ఒక్కొక్కటిగా ఇస్తున్నారు.సైన్సు పత్రాలు ఇచ్చే రోజు హాజరు పట్టీ క్రమంలో అందరివి ఇచ్చారు మద్యలో నాది లేదు. ఒకటే ఉత్కంట. అందరివి అయిపోయిన తర్వాత ప్రతేకకంగా మాష్టారు నన్ను పిలిచారు. నన్ను తనప్రక్కనే నిలబెట్టి జవాబుల పత్రాన్ని అందరికీ చూపిస్తున్నారు. పిల్లలందరికీ ఆశ్చరం ఏ ముందో ప్రత్యేకత అని, మార్కులువేసి ఎందుకు కొట్టివేసారా అని. నాకు ఆశ్చర్యం ఏమంటే కలో ఎలా చూసానో అలానే కనిపించింది. అది అక్సిజన్ తయారుచేసే విధానము, వివరణ బాగుంది, దస్తూరి బాగుంది, బొమ్మబాగుంది. ఇన్ని బాగుండేసరికి 10 మర్కుల ప్రశ్నకు 8 మార్కులు ఇచ్చారు కానీ మళ్ళీ పూర్తిగాచదివితే అందులో చిన్నపొరపాటు వుంది. దానివల్ల మొత్తం వ్యర్థమైపోయింది.అదేమంటే ఫార్ములా తప్పురాయటం.
ఇప్పటికీ ఆశ్చర్యం అలా ఎలా కలలునిజమౌతాయి