అప్పుడప్పుడు నా ప్రక్కటెముకకు కోపమొచ్చినప్పుడు మనలో(క్రైస్తవులలో) పార్థివ దేహాన్ని తగలుబెట్టరుకదా ఇన్ని పుస్తకాలు ఎందుకు? తగలెబెడితే సగం కట్తెలఖర్చు అయినా తప్పుతుంది అంటూ అంటుంది. అలా నా ప్రక్కటెముకతో పోట్లాడినప్పుడల్లా వారపత్రికలనుండి వివిధ పత్రికలనుండి సేకరించినవి దాచుకోలేక పాత కాగితాలవాడికి ఇచ్చివేసిన సందర్భాలు చాల వున్నాయి.
నేను హైదరాబాదు వచ్చిన కొత్తలో రావుగారని సంజీవరెడ్డి నగర్లో వుండేవారు. ఆయనది సొంత ఇల్లు కావటంవల్ల, మావూరి వారు కావటం వల్ల నాలాంటి కుర్రవాళ్ళకి తపలా చిరునామాగా వుండేది. ఆయన భార్య అనుకోని ప్రమాదంలో చనిపోవటం వల్ల చిన్న పిల్లగా వున్న కూతురిని చూసుకుంటూ వేదాంతానికి సంబందించిన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అందులో క్రైస్తవ వేదాంతానికి సంబందించి ఎక్కువగా వుండేవి. నాకు తెలిసీ తెలియని జ్ఞానంతో ఎవోసంగతులను వాదించేవాడిని. చాలా నెమ్మదిగా నకు తెలియచెప్పేవారు. తన అల్మారాలో వున్న పుస్తకాలు అక్కడ కూర్చిని చదవటానికి మాత్రమే అనుమతిచ్చేవారు. రూముకు పట్టుకేళితే తిరిగివస్తుందొ లేదోనని ఆయన అనుమానం.
నేను అటూ ఇటూ తిరిగి (బహుశ ఐదు, ఆరు సంవత్సరాలతర్వాత) ఆయనను పలకరిద్దామని వెళ్ళాను. ఈ మద్యకాలంలో ఆయన మళ్ళీ పెళ్ళిచేసుకున్నారు. నేను వెళ్ళే సరికి వరండాలో చిందరవందరగా పుస్తకాలు పడివున్నాయి, ఏమిటా సంగతి అని ఆరాతీస్తే తెలిసింది పాత పుస్తకాలవాడికి అమ్మేస్తున్నారని. మనసు చివుక్కుమంది. వద్దని వారించాను. ఏమిజరిగిందో కాని నిర్ణయం మార్చుకోలేదు. నీకు ఒపికవుంటే నువ్వు పట్తుకపో ఎప్పుడైనా చూడాలనిపిస్తే నీ దగ్గరకు వస్తాలే అన్నారు. సరేనని బేరం చెడగొట్తినందుకు పాతకాగితాలవాడు నన్ను బాగానే తిట్తుకున్నాడు. అయినా ఎదొలా అవస్తపడి గోనె సంచుల్లో నింపుకొని ఇంటికి తెచ్చుకున్నను. అప్పటినుండి నాకు ఇల్లు మారడంటే పెద్ద కష్టంగా వుండేది. మారినప్పుడల్లా నేను, నా ప్రక్కటెముక తగువులాడుకోవడం మాములే! కాని ఆయన మళ్ళీ నన్ను గాని, ఆయ్నిచ్చిన నా పుస్తకాలు గాని చూడాటానికి రాలేదు. బహుశ ఇప్పటికి 17 సంవత్సరాలు గడచాయనుకుంటా.
నేను సాహిత్యంలో పడ్డప్పటినుంచీ కొన్ని పుస్తకాలు ఒకొక్కటిగా చేరటం మొదలయ్యింది. ఇప్పుడు అద్దె ఇల్లు మారాలంటే ప్రధాన సమస్య పుస్తకాలే. చిన్న గ్రందాలయపు గది వుంచుకోవాలని చిన్న జీవిత కాలపు కోరిక కూడా. సాహిత్యంలో ప్రధానంగా కవిత్వమే వుంటుంది.
Tuesday, April 22, 2008
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
బాగుంది.
మీరు కూడా ... ఎప్పుడన్నా పాత పుస్తకాలవాడికి అమ్మాలి అనుకుంటే,
ఆ పాతపుస్తకాల వాడి బేరం చెడగొట్టేందుకు .... నేను మీదగ్గరకు తప్పని సరిగా వస్తానండోయ్...
(నా లాంటి బ్లాగరులు చాలా మంది ఉంటారు అండోయ్....)
నేను కుడా! కాకపోతే చంద్రమౌళి గారి కంటే ముందు.
@కొత్త పాళీ, చంద్రమౌళి, సుజాత గార్లకు
నెనర్లు
ఇలాంటి సంగతే ఒకటి తెలుసు నాకు.ఒకతనున్నాడు అతని పై కోపం తో అతని భార్య అతడు చిన్న తనం నుండీ సేకరించుకున్న పుస్తకాలనన్నింటి నీ పాత కాగితాల వాడికి అమ్మేసింది. నిజంగా అది విన్నప్పుడు నేనైతే షాక్ అయ్యాను.
Post a Comment