Friday, May 2, 2008

ఈత - బ్లాగ్విషయం-3


ఈత - బ్లాగ్విషయం
మా ఇంటిలో నాకన్నా పెద్దవాళ్ళు నలుగురు వుండటంవల్ల, వాల్లూ వివిధ తరగతులలో చదువుతుండటవలన వారు చదివేవి నాకు కూడా తెలిసేవి. బహుశ ఓ రెండు మూడు సంవత్సరాలు మా కాలనీలోని పిల్లలు అందరూ రాత్రిపూట మా వరండాలోనో, పెరట్లోనో పెట్రమాక్సు లైటువెలిగించి(అప్పటికి ఇంకా మా కాలనీకి విద్యుత్తు రాలేదు) చదువుతూ వుండేవారు. అందులో అన్ని తరగతుల వాళ్ళు వుండే వారు. అలా వాళ్ళు చదువుతున్న వాటిలో నాకు బాగా గుర్తువున్న పాఠం ఇంగ్లీషు చానల్ని ఈదడం. అది నన్ను చాలా ప్రభావితం చేసింది.
అప్పటినుంచి ఈతను గురించిన వార్తలు విన్నప్పుడల్లా హృదయం ఉప్పొంగుతూ వుంటుంది.
శ్రీలంక భారత్ మద్య ఈదిన వారు, ఇంగ్లీషు చానల్ ఈదిన వారు, సునామీలో అండమాన్‌నుంచి ఈదుకొచ్చిన 15సంవత్సరాల పిల్ల, ఇవి వింటున్నప్పుడు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఛేదించే కొత్త మార్గాలను వెతకాలనిపిస్తుంది.
ఈత ఇప్పుడు శారీరక వ్యాయామము లేదా క్రీడా విషయంగా మారిపోయింది.
అప్పుడప్పుడు సముద్ర స్నానాలు చేస్తున్నా, సముద్రంలో ఈత వ్యాపకం మన భారత దేశములో అందులోనో తెలుగువాళ్ళకి తక్కువే అనిచెప్పవచ్చు.
ఈ బ్లాగు రాసే సమయానికి వున్న ఎండవేడిమికి దగ్గరేదైనా ఈతకొట్టే అవకాశం వుంటే బాగుండును అనిపిస్తుంది.

1980-85 ల మద్య మద్యప్రదేశ్‌లోని, సోని నదిపై బాన్‌సాగర్ వద్ద కడుతున్న ప్రాజెక్టులోనో, నర్మదాపై కడుతున్న బర్గీ(జబల్పూర్)డాం కడుతున్న కంపెనీలో పనిచేసాను. శీతాకాలం చలిలో ఉదయం స్నానం, ఈత ముగించుకొని గట్టుపైకి వస్తే వణికించే చలి ఇంకా కళ్ళముందు కదలాడుతుంది.
నర్మదా నీళ్ళు ఎప్పుడూ చాలా చల్లాగావుండేవి. అక్కడరేవులుకూడా చాలాలోతుగా వుండేవి.
సోనీ నదిలో మరో భయం వుండేది. అదేమిటంటే కొన్ని గ్రామాలలో కొన్ని జాతుల వాళ్ళు చనిపోయిన దేహం సగం కాలిన తర్వాత దేహాన్ని నదిలోకి తోసేస్తారు. అవి చివుకుతూ చివికుతూ కొట్టుకువస్తాయి. ఒకసారి నేను ఈతకొదుతున్నాప్పుడు ఒక అనుభవం ఎదురయ్యింది. వళ్ళు జలధరించింది. కొంతకాల ఆ జలధరింపుపోలేదు.
ఈ హైదరాబాదు వచ్చిన తర్వాత ఈత మర్చిపోయానేమో అనిపిస్తుంది

No comments: