Monday, August 18, 2008
అమ్మ ప్రేమకు - సాక్షి మరోసారి
అమ్మ సంకలనానికి సాక్షి మరోసారి సాక్షిగా నిలిచింది.
జ్యోతి వలబోజు రాసిన సమీక్ష సాహిత్య పేజీలో ప్రచురమవ్వటం నిజంగా ఈ-సంకలనానికి గొప్ప ప్రోత్సాహంగా అనిపించింది.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశంతో వార్తలప్రభంజనం మద్య అమ్మ సంకలనంపై సమీక్ష రావటం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.
సాక్షి లంకెకోసం
http://epaper.sakshi.com/epapermain.aspx
డౌను లోడుకోసం
http://aparanji.com/amma.zip
http://files.koodali.org/johnhyde/amma.pdf
Saturday, August 16, 2008
Saturday, August 9, 2008
Friday, August 1, 2008
గ్రంధాలయం సంకలనం -మీ అభిప్రాయాన్ని కోరుతున్నాను
జూలై 22న ప్రకటన చేసాను ఎవ్వరూ స్పందించినట్లు కనబడలేదు.
మీ సలహాలను, అభిప్రాయాలను కోరుతున్నాను.
ముందుకు వెళ్ళాలా వద్దా అనే సందేహం కలుగుతుంది.
-------
త్వరలో "గ్రంధాలయం"
బ్లాగర్ల టపాలతో సంకలనం తేవాలని ఆలోచన
ఇప్పటికే రాసిన వారు ఇంకా రాయలనుకున్నవారు,
ఎక్కడైనా చదివిన టపాలు వుంటే దయచేసి నాకు వేగు(మెయిలు) పంపండి
సమయము అంటూ ఎమీ అనుకోలేదు గాని ఆగస్టు-సెప్టెంబరు కావచ్చు.
ఫోటోలు, జ్ఞాపకాలు, అనుభవాలు, జాబితాలు, పనితీరులు, చరిత్రలు
ప్రభుత్వ ఉత్వర్వులు
గ్రంధాలయానికి సంభందించి ఏ విషయమైనా నలుగురితోనూ పంచుకోండి.
john000in@gmail.com
----
1918
Tuesday, July 22, 2008
త్వరలో గ్రంధాలయం సంకలనం
త్వరలో
"గ్రంధాలయం"
బ్లాగర్ల టపాలతో సంకలనం తేవాలని ఆలోచన
ఇప్పటికే రాసిన వారు ఇంకా రాయలనుకున్నవారు,
ఎక్కడైనా చదివిన టపాలు వుంటే దయచేసి నాకు వేగు(మెయిలు) పంపండి
సమయము అంటూ ఎమీ అనుకోలేదు గాని ఆగస్టు-సెప్టెంబరు కావచ్చు.
ఫోటోలు
జ్ఞాపకాలు
అనుభవాలు
జాబితాలు
పనితీరులు
చరిత్రలు
ప్రభుత్వ ఉత్వర్వులు
గ్రంధాలయానికి సంభందించి ఏ విషయమైనా నలుగురితోనూ పంచుకోండి.
చేయూతనిచ్చేవారు కూడా అవసరం
ఇప్పటివరుకూ నేను చూసినవి
ఇంట్లోనే గ్రంధాలయం Jyothi valboju
బ్లాగ్విషయం - గ్రంధాలయాలు - 1 Kotta Pali
మరపు రాదేల! Harivillu
గ్రంధాలయాలు - నా పుస్తక పఠనం chaitanya paturu
నెల్లూరు జైల్ లో నూతన గ్రంధాలయం Cbrao
గ్రంధాలయం Gaddipoolu Sujatha
బ్లాగ్విషయం - గ్రంధాలయాలు - 1 Kottapali
దిల్ సే …
విజయవాడలో ఒక గ్రంధాలయం Netigen
విశాఖతీరాన...... Rajendra
బ్లాగ్విషయం .. నేను .. నా గ్రంధాలయం. John Hyde
బ్లాగ్విషయం - గ్రంధాలయం - నా జ్ఞాపకాలు, అనుభవాలుJohn Hyde
గ్రంథాలయం - నా దేవాలయం- Ismail
మెయిలు పంపడం, లంకె ఇవ్వడం మర్చిపోవద్దు.
Wednesday, July 16, 2008
అమ్మ సంకలనంలో అనుభూతుల మాల
అమ్మ సంకలనాన్ని విశేషంగా ఆదరించినవారందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
సాంకేతికంగా సహాయాన్ని అందించిన వారు
ముఖచిత్రాన్ని ఒన్లినెలోనే పంపి సంకలనానికి శోభతెచ్చిన తమ్ముడు అగష్టస్ కనుమూరి
పిడిఎఫ్ విషయంలో - శ్రీ తాడేపల్లి సుబ్రహ్మణ్యం ఇచ్చిన వివరణాత్మకమైన టపా సంకలనాన్ని మీవరకూ తేవడానికి సహకరించింది.
టపాను బ్లాగులో పోస్టుచేసిన తరువాత కూడలిలో లింక్ ఇవ్వడం, తరువాత ఫైలును పొందుపరచిన శ్రీ వీవెన్
సమయ సమయాలలో తగుసూచనలిచ్చిన డా.దార్ల, శ్రీ చావా కిరణ్
ప్రాచుర్యాన్ని కలిగించిన "సాక్షి" పత్రిక
"కంప్యూటర్ ఎరా"లో పొందుపరచిన శ్రీధర్
స్పందించి తమ అమూల్యమైన వ్యాఖ్యలను, అభినందనలు తెలియజేసిన వారు
రాజేంద్ర టపా చదివి కొత్త టపా రాసినా లక్ష్మి గారు
వీరందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియచేస్తున్నాను.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...
అద్భుతం జాన్ గారు,నావ్యాసం కూడా ఇందులో ఉన్నందున ఇంతకన్నా ఎక్కువ చెప్పటం భావ్యంగా ఉండదు.
కత్తి మహేష్ కుమార్ said...
చాలా బాగుంది.విషయం ఎలాగూ అద్భుతం కనక, నేను ఆ డిజైన్నూ, ప్రయత్నాన్నీ అభినందిస్తాను. ఇలాంటి సంకలనాన్ని అందిచాలన్న ఆలోచనతోపాటూ, అధ్బుతంగా ఆచరించి చూపిన జాన్ హైడ్ గారికి నెనర్లు.
Shankar Reddy said...
బాగుంది ...మీ ప్రయత్నం అభినందనీయం ...
పద్మనాభం దూర్వాసుల said... This post has been removed by the author. పద్మనాభం దూర్వాసుల said...
జాన్ హైడ్ గారూ
ఇంత చక్కని ఊహ రావడం ఒక ఎత్తైతే దానిని ఇంపైన డిజైన్ తో "అమ్మ" పదం లోని తియ్యదనాన్ని నింపిన టపాలతో అలరించడం ఇంకా అమోఘం. అభినందనలు
జాన్‌హైడ్ కనుమూరి said...
@ రాజేంద్ర గారు
@ మహేష్ గారు
@ శంకర్ గారు
@ పద్మనభం గారు
స్పందనకు నెనరులు
మురళీ కృష్ణ said...
మాటలు రావటం లేదు. ఎటువంటి ఫాన్ ఫేర్ లేకుండా, అద్భుతంగా వచ్చిన ఈ సంకలనం - బహుధా ప్రశంసనీయం.
డా.స్మైల్ said...
'అమ్మ' అన్న పిలుపంత తియ్యగా ఉంది ఈ చిరు పొత్తము!
సుజాత said...
ఇంత మంది అమ్మల్ని ఒక్కచోట చూడ్డం అద్భుతంగా ఉందండీ!
సత్యసాయి కొవ్వలి said...
అద్భుతంగా ఉంది. ఈమధ్య బ్లాగ్లోకాన్ని సందర్శించక పోవడం వల్ల నేను మీసంకలనం గురించి తెలియకపోవడం, ఓటపా రాయలేకపోవడం దురుదృష్టంగా భావిస్తున్నా.
నిషిగంధ said...
జాన్ గారు, అద్భుతమైన సంకలనం.. డిజైన్ చాలా బావుంది.. అమ్మలనందరినీ ఒకేచోట చూడటం అనిర్వచనీయం!
ramya said...
చక్కగా కూర్చారు. మీఅభిరుచి, కృషి కనిపిస్తున్నాయి.
జాన్‌హైడ్ కనుమూరి said...
జ్యొతి వలబోజు గారికి
అమ్మ సంకలనంపై జ్యోతిగారి బ్లాగులో
స్పందించిన వారికి నెనరులు
-------
కొత్త పాళీ said...
అభినందనలు జాన్ హైడ్ గారూ.
పుస్తకం చూశాక మళ్ళీ వస్తా
June 27, 2008 5:32 AM
బొల్లోజు బాబా said...
మంచి సంకలనం.
చాలా మంచి కలెక్షన్
ఇంకా అందం గా తీర్చి దిద్దారు.
బొల్లోజు బాబా
June 27, 2008 5:43 AM
నరసింహ said...
పుస్తకం చదివాక తిరిగి కలుద్దాం.
June 27, 2008 6:16 AM
Purnima said...
haai.. indulo naa tapaa koodaa unde!!
Thanks for considering my post at the very last moment!! :-)
Purnima
June 27, 2008 6:59 AM
ప్రవీణ్ గార్లపాటి said...
ఇంకా టపాలు చదవలేదు కానీ డిజైన్ మాత్రం అద్భుతంగా ఉంది. రంగులు, బొమ్మలు, డిజైన్లు అన్నీ.
జాన్ గారికి అభినందనలు.
June 27, 2008 9:40 AM
mrinalini said...
jyothi garu
mi rachanalu chala bagunnai.....
congrats
June 27, 2008 11:24 PM
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...
ప్రతి మగపిల్లవాడి పట్ల ప్రతి అమ్మ అతని బాల్యంలో మాత్రమే కాక జీవితాంతం అతనికి అమ్మగానే ప్రవర్తించగలగాలని ఆశిస్తూ ఈ సంకలనాన్ని అభినందిస్తున్నాను.
జాన్‌హైడ్ కనుమూరి said...
@ మురళీ కృష్ణ
@ డా.స్మైల్
@ సుజాత
@ సత్యసాయి కొవ్వలి
@ నిషిగద
@ రమ్య
అందరికీ నెనరులు
డా.వి.ఆర్ . దార్ల said...
జాన్ హైడ్ కనుమూరి గారూ!
నమస్తే...
అద్భుతమైన పుస్తకం తీసుకొచ్చారు.దీనిపై ఇంతకుముందే మీకు వ్యక్తిగతంగా మెయిల్ ఇచ్చాను.
మళ్ళీ అభినందిస్తున్నాను.
మీ
దార్ల
ఏకాంతపు దిలీప్ said...
@జాన్ హైడ్ గారు
మీ శ్రమ అభినందనీయం. డిజైన్ చాలా బాగుంది. ఈ సంకలనం ద్వారా నేను చదవని కొన్ని రచనలు చదివాను. అనిర్విచనీయమైన అనుభూతికి గురయ్యాను. మీకు కృతజ్ఞుడుని.
జాన్‌హైడ్ కనుమూరి said...
మీ ప్రోత్సాహానికి నెనరులు
దార్ల గారి మెయిలునుంచి
-----------
జాన్ హైడ్ గార్కి,
నమసే!
మీరు పంపిన అమ్మ కవితాసంకలనం చదివాను. జ్యోతి గారు చాలా వాస్తవ విషయాలు రాశారు. ఆలోచనాత్మకాలు. కస్తూరి మురళీకృష్ణ లాంటి సీరియెస్ రచయిత కూడా రాజేంద్ర గారి వ్యాసం చదివి , ఆయన కూడా రాశారు. మంచి స్పందన ఉందా వ్యాసంలో! నిజమే అమ్మ గురించి వెయ్యి పేజీలు కూ డా సరిపోవు. కానీ ఎంతో ఆకర్ష ణీయంగా పుస్తకాన్ని తీర్చి దిద్దారు.
మీ కృషి గొప్పదనిపించింది. అభినందనలు. ఇది బ్లాగులో పెట్టిన తర్వాత మరికొంత మంది మళ్ళీ అమ్మ గురించి తప్పకుండా రాస్తారు...కాదు..రాయాలనిపిస్తుంది. దీన్ని ప్రింట్ మీడియావాళ్ళు కూడా సమీక్షించే అవకాశం ఉంది.
మంచి సంకలనం తీసుకొచ్చిన మీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
మీ హృదయం లోని ప్రేమ ను అమ్మ కవితా సంకలనం ద్వారా చూడ గలిగాను .
ఉంటాను
మీ
దార్ల
జాన్‌హైడ్ కనుమూరి said...
కొత్త పాళీ said...
జాన్ హైడ్ గారూ.
అమ్మ సంకలనం చాలా బాగా చేశారు. ప్రతీ పేజీకీ ఒక జరీ అంచు, అద్దిన రంగులు, అతికినట్టున్న బొమ్మలు .. సౌందర్యం కోసం మీరు పడే తపన కనిపించింది, ఫలించింది. కథనాలు కూడా చాలా బాగున్నాయి మనసుకి హత్తుకునేలా.
మీకూ, రచయితలందరికీ కూడా అభినందనలు.
June 27, 2008 6:16 PM
జాన్‌హైడ్ కనుమూరి said...
ఏకాంతపు దిలీపు కృతజ్ఞతలు ఎందుకండి.
కొత్తపాళీ గారు
జరీ అంచు అనే మీమాట నన్ను ఉక్కిరి బిక్కిరిచేసింది
మీవ్యాకకు, స్పందనకు నెనరులు
Dil said...
చక్కని ప్రయత్నం. నేను మొదలు రాద్దామనుకుని మిస్సయ్యాను.
ఇక తెలుగులో ఈ-పుస్తకాల శకం మొదలైనట్టే.
అభినందనలతో
కొణతం దిలీప్
జ్యోతి said...
జాన్ గారు,
అభినందనలు . మంచి సంకలనం అందించారు.
జాన్‌హైడ్ కనుమూరి said...
కొణతం దిలీపు
మీరు రాస్తే దార్లగారు అన్నమాట నిజమౌతుంది.
మి స్పందనకు నెనరులు
జ్యోతి వలబోజు గారు
మీ స్పందనకు నెనరులు
కొల్లూరి సోమ శంకర్ said...
జాన్ హైడ్ గారూ,
మీ అమ్మ సంకలనం చదివాను. ప్రతీ పుటలోనూ మీ శ్రమ కనపడుతోంది. ఆయా బ్లాగర్ల రచనలకు మీరు ఎంపిక చేసిన ఫోటోలు చక్కగా నప్పాయి. లే-అవుట్, కవర్ డిజైన్ చాలా బావున్నాయి. అవి సంకలనంలోని అద్భుతమైన కంటెంట్‌కి మరింత అందాన్నిచ్చాయి. మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
కొల్లూరి సోమ శంకర్
www.kollurisomasankar.wordpress.com
జాన్‌హైడ్ కనుమూరి said...
సోమశంకర్ గారు
పరిశీలనతో కూడిన మీ స్పందనకు నెనరులు.
అయితే
కవరుపేజీ నేను రూపొందించలేదు, ఆ విషయం సంకలనంలో చెప్పడం మరచిపోయాను.
అది తమ్ముడు అగష్టస్ రూపొందించడం జరిగింది.
sridhar said...
adbhutham...apoorvam...akhandam...ee kavitaa sankalanaanni chadivina taruvata naa noti nundi maatalu ravatam ledu..okkokkari anubhavaalu chaduvutunte, naa kallu enni saarlu chemmagillaayo naake aascharyam vesindi....rajendragaru, muralikrishnagaru, okarenti evaru raasinaa asalu vishayame alaantidi..."AMMA" ane aa padamlone undi anta mahattu...alaanti vishayam paina ee sankalanam plan chesina john hyde kanumoori gariki naa hrudaya poorvaka abhinandanalu.....alagani ikkada vaari vaari anubhavalu panchukunna vaallanu nenu takkuva cheyatamledu....endaro mahanubhavulu..andarikee vandanamulu...mee andari nunchi sphoorthi pondutunnaanu nenu...ee kshanam nunchi ika naaku oke aalochana....amma kosam edainaa cheyyaali...tanaku edi baagaa ishtamo telusukoni adi tananku samakooretlugaa choodaali elaagainaa....akharugaa marokkasaari andarikee krutagnathalu....naa peru sridhar karanam.
sujata said...
sir,
Thanks for publishing my post in here. This book is phenomenal and one of its kind. I felt very heavy-hearted and speechless at the end of the book. Good idea and good effort. Worth it.. Really! Well done.
జాన్‌హైడ్ కనుమూరి said...
@ సుజాత,
@ శ్రీధర్
మీరు తెలుగులో రాసివుంటే బాగుండేది
ఏమైనా స్పందనకు నెనరులు
Anonymous said...
జాన్ గారికి
అభినందనలు మంచి ప్రయత్నంచేసారు.
మీ కవిత అమ్మ నేను చదువుతున్నప్పుడు ఎప్పుడో చదివిన ఫ్రెంచి కవిత గుర్తుకొచ్చింది.
అందులో ...
"ప్రమిద దీపం వెలిగించి చదువుకుంటున్నప్పుడు
చేతిని చాపితే కావలసినవి అందుబాటులో వుండేవి
ఇప్పుడు
దీపం అలానేవుంది
చెయ్యే కదలటంలేదు" అని
----
దార్ల కవితలో సమాజిక పరిస్థితులను చక్కగా చెప్పారు.
-----
కొత్తవారిని ప్రోత్సాహంగా జరిగిన మీ ప్రయత్నానికి మరొక్కసారి అభినందిస్తున్నాను.
సి.వి.కృష్ణారావు, హైదరాబాదు
అశ్విన్ బూదరాజు said...
బావుంది , మీ రు పడిన కశ్టం తెలుస్తుంది, మీకు నా ధన్యావాదాలు
జాన్‌హైడ్ కనుమూరి said...
ప్రోత్సాహం దొరకాలేగానీ ఇదేమీ పెద్దకష్టం కాదండీ
స్పంద్నకు నెనరులు
Anonymous said...
చాలా మంచి ప్రయత్నం. అభినందనలు. ఇలాగే మరిన్ని సంకలనాలు ప్రచురించగలరు.
--
త్రివిక్రమ్
"We don't see things as they are, we see them as we are."
Anonymous said...
దుప్పల రవికుమార్ said...
ఇప్పుడు జాన్ హైడ్ కనుమూరి గారు అమ్మ సంకలనపు జాన్ గారు. అంటే అమ్మ జాన్ గారు. అంత గొప్ప అనురాగ భరిత కృషి చేసినందుకు వారికి అభినందనలు. ఇలాంటి మంచి అవిడియాలు ఎలా వస్తాయో కదా! నాకూ ఉంది మట్టి బుర్ర. కాస్త నయమేమిటంటే అవి చదవగలిగే అదృష్టవంతుణ్ణవడం. ఇంకా మరిన్ని మంచి ఆలోచనలతో మీరు పయనించాలని ... నమస్తే.
Srividya said...
చాలా బావుందండీ. నిజంగా మిమ్మల్ని అభినందించాలి. ఇంకా ఇలానే మంచి సంకలనాలు ప్రచురించాలని కోరుకుంటున్నా....
జాన్‌హైడ్ కనుమూరి said...
గురువు గారు కృష్ణారావు గారు
అయ్యా మీ అభిమనానికి ఎలాకృతజ్ఞత తెలపాలో తెలియటంలేదు.
మీకు ప్రెంచి కవిత గుర్తు చేయగలిగినందుకు నా ఈ ప్రయత్నం సఫలమయ్యిందని భావిస్తున్నాను
స్ర్వదా మీ ఆశీర్వాదాలు కోరుతూ
జాన్‌హైడ్ కనుమూరి said...
@ దుప్పల రవికుమార్ గారికి
మీ అభిమానానికి ధన్యవాదాలు
@ త్రివిక్రం గారికి
@ శ్రీవిద్య గారికి
మీ స్పందనకు నెనరులు
Anonymous said...
http://pavani5.wordpress.com/2008/07/
రాజేంద్ర గారి బ్లాగులో “అమ్మ” పోస్ట్ల్ లో వాళ్ళమ్మ గారి గురించి చదివిన తర్వాత
July 15, 2008 3:44 AM
జాన్ హైడ్ కనుమూరి గారు నమస్కారం,
అడిగిన తక్షణం ఫైళ్లు పంపించినందుకు ధన్యవాదాలు. అమ్మ సంకలనం scribed పుస్తకాన్ని కంప్యూటర్ ఎరా ఫోరంలో సభ్యులకు అందుబాటులో ఉండే విధంగా http://computerera.co.in/forumnew/showthread.php?p=6015 అనే లింకులో పొందుపరచడం జరిగింది. గమనించగలరు. ధన్యవాదాలు.
- నల్లమోతు శ్రీధర్
--------------
1693

Monday, July 7, 2008
Monday, June 30, 2008
Friday, June 27, 2008
Thursday, June 19, 2008
Friday, May 30, 2008
అమ్మ సంకలనం
అమ్మ సంకలనం
కొన్ని పనుల వత్తిడివల్ల అనుకున్న సమయం కన్నా కొంచెం జాప్యం జరిగింది
జూన్ 6వ తేదీలోపు మీ ముందుంచుతాను.
ప్రస్తుతం సాంకేతిక పరంగా పి.డి.ఎఫ్. బ్లాగులో ఎలా ఎక్కించాలో తెలియదు.
ఒకసారి తాడెపల్లి వివరించారు గాని అప్పుడు విఫలమయ్యాను.
ఈ విషయం ఎవరైనా సహాయం చేస్తే సంతోషిస్తాను.

Thursday, May 15, 2008
అమ్మ - బ్లాగ్ - సంకలనం
Tuesday, May 13, 2008
అమ్మ - బ్లాగు సంకలనం
అమ్మంటే ఓ అద్భుతం
అమ్మంటే ఓ అపురూపం
మురిపాలు, జ్ఞాపకాలు,
లాలిపాటలు, గోరుముద్దలు
అక్షరాలు, ఆలింగనాలు
నడక నడత
ఆనురాగాలు ఆత్మీయతలు
ఇంకా ... ఇంకా..
మీ గళంనుండి కలం నుండీ పంచుకోండి
ఓ మరుపురాని జ్ఞాపకాన్ని తయారు చేద్దాం
మదర్స్ డే సందర్బంగా మీ పోస్టులను, మీ భావాలను, మీ అభిమానాన్ని తెలియజేస్తూ రాసినవి నాకు వేగు పంపండి.
ఈ ఆలోచనలలో మీరు పాలుపంచుకోండి
ఎంత త్వరగా పంపితే అంత మంచిది.
లింకు ఇవ్వడం మర్చిపోకండి
పుస్తకంగా(పి.డి.ఎఫ్.) కూర్చి పంపుతాను.
john000in@gmail.com
Monday, May 5, 2008
ఈత - బ్లాగ్విషయం - సుడిలో నా అనుభవం
నేను పోలవరంలొ హైస్కూలు చదువుతున్న రోజుల్లో ప్రతీరోజూ గోదావరిలో ఈత, స్నానం, ఆటలు జరిగేవి.
ఓ రోజు లాంచీల రేవులోకొందరు మిత్రులు ఈదుతూ కొంత దూరంలో నిలబడి ఇక్కడలోతు తక్కువగా వుంది రా అని పిలచారు. నిజానికి లాంచీలరేవు లోతుగా వుంటుంది. నేను రాను బజారు రేవుకు(ఆలవాటైనది, రోజూవెళ్ళేది) పోతాను అన్నాను. కానీ స్నేహితులు పిలచేసరికి దిగాను. కొద్దిదూరం ఈదగానే ఒక్కసారిగా మునిగిపోవటం జరిగింది. మొఖానికి వంటికి ఏదో నాచు లాంటిది మెత్తగా తగిలింది. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఎలాగో తెగించి పైకిలేచాను. ఒక్క దమ్ము ఊపిరి తీసుకోగానే అర్థం అయ్యింది నేను సుడిలో పడ్డానని. నా బలాన్ని అంతా వుపయోగించి తపతపా కొట్టుకున్నాను. ఎలాగో బటపడ్డాను. ఒడ్డుకుచేరి కొద్దిసేపు తెప్పరిల్లాను, నన్ను పిలుస్తున్న నా మిత్రులు నేను కొత్త పల్టీలు కొడుతున్నా నని నవ్వుతున్నారు. తీరా విషయం తెలిసాక వాళ్ళుకూడా ఆరేవులోకి మళ్ళీ వెళ్ళలేదు. ఒక రకంకంగా చావు తప్పి బ్రతికాననిపిస్తుంది.
Friday, May 2, 2008
ఈత - బ్లాగ్విషయం-3
ఈత - బ్లాగ్విషయం
మా ఇంటిలో నాకన్నా పెద్దవాళ్ళు నలుగురు వుండటంవల్ల, వాల్లూ వివిధ తరగతులలో చదువుతుండటవలన వారు చదివేవి నాకు కూడా తెలిసేవి. బహుశ ఓ రెండు మూడు సంవత్సరాలు మా కాలనీలోని పిల్లలు అందరూ రాత్రిపూట మా వరండాలోనో, పెరట్లోనో పెట్రమాక్సు లైటువెలిగించి(అప్పటికి ఇంకా మా కాలనీకి విద్యుత్తు రాలేదు) చదువుతూ వుండేవారు. అందులో అన్ని తరగతుల వాళ్ళు వుండే వారు. అలా వాళ్ళు చదువుతున్న వాటిలో నాకు బాగా గుర్తువున్న పాఠం ఇంగ్లీషు చానల్ని ఈదడం. అది నన్ను చాలా ప్రభావితం చేసింది.
అప్పటినుంచి ఈతను గురించిన వార్తలు విన్నప్పుడల్లా హృదయం ఉప్పొంగుతూ వుంటుంది.
శ్రీలంక భారత్ మద్య ఈదిన వారు, ఇంగ్లీషు చానల్ ఈదిన వారు, సునామీలో అండమాన్‌నుంచి ఈదుకొచ్చిన 15సంవత్సరాల పిల్ల, ఇవి వింటున్నప్పుడు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఛేదించే కొత్త మార్గాలను వెతకాలనిపిస్తుంది.
ఈత ఇప్పుడు శారీరక వ్యాయామము లేదా క్రీడా విషయంగా మారిపోయింది.
అప్పుడప్పుడు సముద్ర స్నానాలు చేస్తున్నా, సముద్రంలో ఈత వ్యాపకం మన భారత దేశములో అందులోనో తెలుగువాళ్ళకి తక్కువే అనిచెప్పవచ్చు.
ఈ బ్లాగు రాసే సమయానికి వున్న ఎండవేడిమికి దగ్గరేదైనా ఈతకొట్టే అవకాశం వుంటే బాగుండును అనిపిస్తుంది.
1980-85 ల మద్య మద్యప్రదేశ్‌లోని, సోని నదిపై బాన్‌సాగర్ వద్ద కడుతున్న ప్రాజెక్టులోనో, నర్మదాపై కడుతున్న బర్గీ(జబల్పూర్)డాం కడుతున్న కంపెనీలో పనిచేసాను. శీతాకాలం చలిలో ఉదయం స్నానం, ఈత ముగించుకొని గట్టుపైకి వస్తే వణికించే చలి ఇంకా కళ్ళముందు కదలాడుతుంది.
నర్మదా నీళ్ళు ఎప్పుడూ చాలా చల్లాగావుండేవి. అక్కడరేవులుకూడా చాలాలోతుగా వుండేవి.
సోనీ నదిలో మరో భయం వుండేది. అదేమిటంటే కొన్ని గ్రామాలలో కొన్ని జాతుల వాళ్ళు చనిపోయిన దేహం సగం కాలిన తర్వాత దేహాన్ని నదిలోకి తోసేస్తారు. అవి చివుకుతూ చివికుతూ కొట్టుకువస్తాయి. ఒకసారి నేను ఈతకొదుతున్నాప్పుడు ఒక అనుభవం ఎదురయ్యింది. వళ్ళు జలధరించింది. కొంతకాల ఆ జలధరింపుపోలేదు.
ఈ హైదరాబాదు వచ్చిన తర్వాత ఈత మర్చిపోయానేమో అనిపిస్తుంది
Wednesday, April 30, 2008
ఈత బ్లాగ్విషయం 2
ఈత - బ్లాగ్విషయం
బహుశ నా 8-9 సంవత్సరాల వయస్సులో మొదటిసారి ఈతకోసం ప్రయత్నించిన గుర్తు.
గోదావరి నదిలొనే నా ఈతకుశ్రీకారం చుట్టాను. కొరుటూరు, టేకూరు, కొండమొదలు, పోలవరం, పట్టిసీమ, కొవ్వూరు, కొత్తపేట, రాజమండ్రి, ఔరంగబాద ఇవి నేను ఈతకొట్టిన రేవులు. ఒక స్థలానికీ ఇంకొకస్థలానికీ మద్య పోలికలు, అనుభవాలు వేరువేరుగా వున్నాయి.
పోలవరంలో విద్యాభ్యాసం జరిగినంతకాలం ప్రతీరోజూ గోదావరిలో స్నానంచేయడం, స్నానాకి వెళ్ళవద్దు అని ఇంటిలోనివాళ్ళు నిర్భందిస్తే కావిడతీసుకొని, నీళ్ళుతెస్తానని ఒంకపెట్టడం అలవాటయ్యింది
వేసవి లేదా ఎండగా వున్న రోజులలో ఎప్పుడు స్కూలు అయిపోతుందా, ఎప్పుడు ఎందకొంచెం తగ్గుతుందా అని ఎదురుచూసిన సందర్భాలు చాలావున్నాయి.
గోదావరిరేవుకు వెళ్లినతర్వాత, కేరింతలు, నీళ్ళలోనే ఈదుతూ దాగుదుమూతలు, అప్పుడప్పుడు పల్లెవాళ్ళు(చేపలు పట్టే) వారి పడవలను తోసుకువెళ్ళి ఆవలి వైపుకు వెళ్ళడం జరిగేవి. ఇలా ఆదుకొన్న రోజులు బహుశ 6-8 తరగతి వయస్సు మరియు స్నేహితులు వుండేవారు.
ఈ బ్లాగు కోసం వారిని ఒకొక్కరిని గుర్తుచేసుకున్నాను
నాగేశ్వరర్రావు, తూము రమచంద్రరావు, భాషా, కాగితాల రాంబాబు, సుబ్బారావు వీరుమాత్రమే గుర్కువచ్చారు.
నేను ఒకఒమ్మాయికి ఈతనేర్పడం మా సమూహంలో చంచలన విషయం. ఆ అమ్మాయి నేను అప్పటికి 8వ తరగతి చదివేవాళ్ళం.
నేను ఈతకొడుతూ ఎవరినీ రక్షించిన జ్ఞాపకాలు లేవుగాని, అప్పుడప్పుడు నీళ్ళకోసం వచ్చిన వారి బిందెలు కడుగుతున్నప్పుడు ప్రవాహానికి కొట్టుకపోయేవి, చూస్తుండగానే లోతులోకో, దూరంగానో వెళ్ళిపోయేవి. అలాంటి సమయంలో వాటిని(ఈదుకొని) తెచ్చిన గుర్తులు రెండో మూడొ ఇంకా ఎక్కువో వుండవచ్చు.
ఒకేరేవులో స్నానం చేస్తూనో ఈతకొడుతూనో వుండటంవల్ల దాని లోతు పాతులు, సుడులు తెలిసి జాగ్రత్తగా వుండేవాళ్ళం. అయినా అప్పుడూ రెవులో స్నానచేస్తూ కొట్తుకుపోయిన, మునిగిపోయిన సంఘటనలు జరిగేవి. అలాంటప్పుడు కొన్నిరోజులు మా బాచ్‌పై గోదావరికి వెళ్ళకుండా నిఘా వుండేది.
అప్పుడే మునుగీత, బారలు, వనుకకు ఈదడం(బాక్ స్త్రొక్), ములిగితేలుతూ (బట్తర్ ప్లై) , నిలువు ఈత, ఒకేచోట నీళ్ళపై తేలివుండటం, ఇలా కొన్ని రకాలు నేర్చుకొనటం జరిగింది
....... తర్వాత టపాలో మరికొన్ని
Sunday, April 27, 2008
ఈత - బ్లాగ్విషయం
ఈత గురించి నాకు తెలిసినది చెప్పి తర్వాత నా అనుభవాలు చెపుతాను.
ఈత స్థలాలు :
సముద్రం, నది, కాలువ, చెఱువు, బావి, దిగుడు బావి ఇవి సహజ స్థలాలు.
సహజమైన స్థలాలు ఎప్పుడూ ఒకేరకమైన లోతులు వుండవు. ఒక్కోటి ఒక్కోవిధంగా వుంటుంది.
నది, కాలువలలో ప్రవాహం వుంటుంది.
అంతే కాకుండా సుడులు, గుంతలు వుండి ప్రమాద కారకాలు అవుతుంటాయి.
సముద్రంలో ఈతకొట్టడానికి అలలను గుర్తించాల్సిన అవసరం వుంటుంది.
భౌగోళిక పరిస్థితులను బట్టి సముద్రతీరాలు(బీచ్) వుంటాయి.
దాన్ని బట్టే లోతులు వుంటాయి.
ఉదాహరణికి : కాకినాడ బీచ్ - వాలుగా వుండటం వల్ల లోతు ఒకచూటుకి ఇంకొకచోటుకీ తేడా వుంటుంది.
అదే మంగినపూడి(మచిలీపట్నం) బీచ్ లోపలికి ఎంతవెళ్ళినా లోతువుండదు.
బాపట్ల(సూర్యలంక) పైరెండిటికీ మద్యలొ వుంటుంది
చెఱువు, బావి, దిగుడు బావులలో లోతును గమనించి నిలువుగా నీటిపై తేలివుండాల్సిన అవసరం. (వేగవంతంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి కనుమరుగైపోతున్నాయి)
ఈతకొలను (స్విమ్మింగ్‌పూల్) కృత్రిమమైనది.
శాస్త్రీయంగా ఈతల రకాలు నాకు తెలియవు గానీ నెను నేర్చు కున్నవి కొన్ని చెబుతాను.
బహుశ నా 8-9 సంవత్సరాల వయసప్పుడు మొదటిసారి గోదావరిలో దిగి మావయ్య ఆనందరావు సహాయంతో ఈతపేరుతో తపతప కొట్టుకున్న గుర్తు.
మరికొన్ని వివరాలు తర్వాత టపాలో...
Wednesday, April 23, 2008
బ్లాగ్విషయం - గ్రంధాలయం - నా జ్ఞాపకాలు, అనుభవాలు
పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం గ్రామం, 1970 -72 సంవత్సరాలమద్య 6- 7 తరగతులు చదివేటప్పుడు గ్రంధాలయం పరిచయమయ్యింది. అప్పట్లో చందమామ, విజయచిత్ర, సినిమారంగం సోవియెట్‌భూమి పత్రికలు పరిచయమయ్యాయి. అప్పటిలోనే నవలలు ఎక్కువగా చదివే వారు. మా కాలనీలో కొంతమంది నాకంటే పెద్దవారు తరచూ నవలలు చదవటం, ఒకరి పుస్తకాలను ఒకరు ఇచ్చిపుచ్చుకోవటం జరిగేది. ఆ కార్యక్రమమంలో నేను వార్తాహరుడిగా దూరే వాణ్ణి. వారితో తోడుగా వెళ్ళి వాళ్ళు నవలలు వెతుక్కొనేలోపు విజయచిత్రను తిరగెయ్యటం, చందమామలో ఒక కథ చదవడం, వేరేవారు చుదువుతుంటే దానికోసం నిరీక్షించడం లీలగా గుర్తుకొస్తున్నాయి. ఇక్కడే నాటకాలతో పరిచయం ఏర్పడింది. కృష్ణమూర్తి గారని మా ఇంటి ప్రక్కన వుండే వారు. (ఆయన అప్పటిలో నాటకాలు వేసేవారు. తర్వాత చాలా సినిమాలలో జడ్జి పాత్రలు వేయడం వల్ల జడ్జి కృష్ణమూర్తిగా ఇప్పటికి నటిస్తున్నారు.)ఈ లైబ్రరీలోని ఒక రూములో రిహార్సల్సు జరిగేవి. అప్పటికే నా దస్తూరి బాగుండటంవలన స్క్రిప్టు రాయించుకోవడానికి అప్పుడప్పుడూ తీసుకువెళ్ళేవారు. ఆవూరిలో వున్న ఎన్.జి.వోలు అందరూ కలసి తరచూ నాటకాలు వేస్తుండేవారు. వారికి స్క్రిప్టుతో పాటు నీళ్ళు, సిగరెట్లు, ఫలహారాలు అందించిన గుర్తు. ఆ సమయంలోనే "కర్ణ" ఏక పాత్రాభినయం కంఠతా పట్టిన గుర్తు. ఇంటరు చదివే రోజుల్లో శెలవలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడూ వెళ్ళిన గుర్తు. ఖచ్చితంగా ఏ పుస్తకాలు చదివానో గుర్తు రావటంలేదు.1986 గోదావరి వరదలలో లైబ్రెరీ బాగా దెబ్బతిందని విన్నాను, అంతే కాదు భవనం కూడా మారింది. చాలా సార్లు పోలవరం వెళ్లినా గ్రంధాలయానికి వెళ్ళిన గుర్తు లేదు.
Tuesday, April 22, 2008
బ్లాగ్విషయం .. నేను .. నా గ్రంధాలయం
అప్పుడప్పుడు నా ప్రక్కటెముకకు కోపమొచ్చినప్పుడు మనలో(క్రైస్తవులలో) పార్థివ దేహాన్ని తగలుబెట్టరుకదా ఇన్ని పుస్తకాలు ఎందుకు? తగలెబెడితే సగం కట్తెలఖర్చు అయినా తప్పుతుంది అంటూ అంటుంది. అలా నా ప్రక్కటెముకతో పోట్లాడినప్పుడల్లా వారపత్రికలనుండి వివిధ పత్రికలనుండి సేకరించినవి దాచుకోలేక పాత కాగితాలవాడికి ఇచ్చివేసిన సందర్భాలు చాల వున్నాయి.
నేను హైదరాబాదు వచ్చిన కొత్తలో రావుగారని సంజీవరెడ్డి నగర్‌లో వుండేవారు. ఆయనది సొంత ఇల్లు కావటంవల్ల, మావూరి వారు కావటం వల్ల నాలాంటి కుర్రవాళ్ళకి తపలా చిరునామాగా వుండేది. ఆయన భార్య అనుకోని ప్రమాదంలో చనిపోవటం వల్ల చిన్న పిల్లగా వున్న కూతురిని చూసుకుంటూ వేదాంతానికి సంబందించిన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అందులో క్రైస్తవ వేదాంతానికి సంబందించి ఎక్కువగా వుండేవి. నాకు తెలిసీ తెలియని జ్ఞానంతో ఎవోసంగతులను వాదించేవాడిని. చాలా నెమ్మదిగా నకు తెలియచెప్పేవారు. తన అల్మారాలో వున్న పుస్తకాలు అక్కడ కూర్చిని చదవటానికి మాత్రమే అనుమతిచ్చేవారు. రూముకు పట్టుకేళితే తిరిగివస్తుందొ లేదోనని ఆయన అనుమానం.
నేను అటూ ఇటూ తిరిగి (బహుశ ఐదు, ఆరు సంవత్సరాలతర్వాత) ఆయనను పలకరిద్దామని వెళ్ళాను. ఈ మద్యకాలంలో ఆయన మళ్ళీ పెళ్ళిచేసుకున్నారు. నేను వెళ్ళే సరికి వరండాలో చిందరవందరగా పుస్తకాలు పడివున్నాయి, ఏమిటా సంగతి అని ఆరాతీస్తే తెలిసింది పాత పుస్తకాలవాడికి అమ్మేస్తున్నారని. మనసు చివుక్కుమంది. వద్దని వారించాను. ఏమిజరిగిందో కాని నిర్ణయం మార్చుకోలేదు. నీకు ఒపికవుంటే నువ్వు పట్తుకపో ఎప్పుడైనా చూడాలనిపిస్తే నీ దగ్గరకు వస్తాలే అన్నారు. సరేనని బేరం చెడగొట్తినందుకు పాతకాగితాలవాడు నన్ను బాగానే తిట్తుకున్నాడు. అయినా ఎదొలా అవస్తపడి గోనె సంచుల్లో నింపుకొని ఇంటికి తెచ్చుకున్నను. అప్పటినుండి నాకు ఇల్లు మారడంటే పెద్ద కష్టంగా వుండేది. మారినప్పుడల్లా నేను, నా ప్రక్కటెముక తగువులాడుకోవడం మాములే! కాని ఆయన మళ్ళీ నన్ను గాని, ఆయ్నిచ్చిన నా పుస్తకాలు గాని చూడాటానికి రాలేదు. బహుశ ఇప్పటికి 17 సంవత్సరాలు గడచాయనుకుంటా.
నేను సాహిత్యంలో పడ్డప్పటినుంచీ కొన్ని పుస్తకాలు ఒకొక్కటిగా చేరటం మొదలయ్యింది. ఇప్పుడు అద్దె ఇల్లు మారాలంటే ప్రధాన సమస్య పుస్తకాలే. చిన్న గ్రందాలయపు గది వుంచుకోవాలని చిన్న జీవిత కాలపు కోరిక కూడా. సాహిత్యంలో ప్రధానంగా కవిత్వమే వుంటుంది.

బ్లాగ్విషయం - గ్రంధాలయం
avigaa తన అభిమానించిన పుస్తకాలను దాచుకోవడంతో మొదలుపెట్టిన శ్రీ రాజు, మిత్రులు సాహితీప్రియుల మద్య కవిరాజుగా సుపరిచుతుడై తను సేకరించిన పుస్తకాలకోసం తన ఇంటి మొదటి అంతస్తు మొత్తాన్ని కేటాయించారు. అక్కడ ఇప్పుడు తరచూ సాహిత్య చర్చలు, సమావేసాలు జరుగుతున్నాయి.
చాలా ప్రాచీన, నూతన గ్రంధాలు ఇక్కడ వున్నాయి
గ్రందాలయానికి అందరికీ అహ్వానం వుంది
చిరునామా
నాగేశ్వరి కవిరాజు అక్షరాలయం
5-7-37, సంగీత్ నగర్,
కుకట్‌పల్లి, హైదరాబాదు. పోను : 040-23066444
మీరు దగ్గరలోవుంటే ఒకసారి దర్శించండి

Monday, January 7, 2008
బ్లాగ్విషయం - పాట నేను రాసిన పాటలు - 1
ఎదురుచూపుల తలపులు
ఎదురుచూసా ప్రతిక్షణం
వూహలవేగంతో ఎగిరొస్తావని
కనులలో కదిలే
కలలకే రూపం యిస్తావని
విడివడిపోయిన ముంగురులు
పడిగాపుల చూపులు
విసిగి వేసారి
నిట్టూర్పుల సెగలైపోవగ
ముంగురులనే సవరించ
మోముపై కదలాడిన వేలికొనలు
గిలిగింతలై నడయాడేనని
ఎదురుచూసా
సతమతమయ్యే పనులు
మది కలచే గిరులు
నిలచి కలచి కుతకుతలాడగ
కదులుతుంటే
వూతమిచ్చే మోతాదుగా
చెవిలో పలికే పలుకులై
మూటల ధైర్యమయ్యేనని
ఎదురుచూసా
ఎదురుచూసా ప్రతిక్షణం
వూహలవేగంతో ఎగిరొస్తావని
కనులలో కదిలే
కలలకే రూపం యిస్తావని
విడివడిపోయిన ముంగురులు
పడిగాపుల చూపులు
విసిగి వేసారి
నిట్టూర్పుల సెగలైపోవగ
ముంగురులనే సవరించ
మోముపై కదలాడిన వేలికొనలు
గిలిగింతలై నడయాడేనని
ఎదురుచూసా
సతమతమయ్యే పనులు
మది కలచే గిరులు
నిలచి కలచి కుతకుతలాడగ
కదులుతుంటే
వూతమిచ్చే మోతాదుగా
చెవిలో పలికే పలుకులై
మూటల ధైర్యమయ్యేనని
ఎదురుచూసా
Subscribe to:
Posts (Atom)