అమ్మ సంకలనం చదివినవారికి అమ్మంటే ఓ అద్బుతమైన రూపం చదివిన తర్వాత మనోఃపలకాలలో కలగాలని నా ఆశ.
Thursday, June 19, 2008
Friday, May 30, 2008
అమ్మ సంకలనం
అమ్మ సంకలనం
కొన్ని పనుల వత్తిడివల్ల అనుకున్న సమయం కన్నా కొంచెం జాప్యం జరిగింది
జూన్ 6వ తేదీలోపు మీ ముందుంచుతాను.
ప్రస్తుతం సాంకేతిక పరంగా పి.డి.ఎఫ్. బ్లాగులో ఎలా ఎక్కించాలో తెలియదు.
ఒకసారి తాడెపల్లి వివరించారు గాని అప్పుడు విఫలమయ్యాను.
ఈ విషయం ఎవరైనా సహాయం చేస్తే సంతోషిస్తాను.
కొన్ని పనుల వత్తిడివల్ల అనుకున్న సమయం కన్నా కొంచెం జాప్యం జరిగింది
జూన్ 6వ తేదీలోపు మీ ముందుంచుతాను.
ప్రస్తుతం సాంకేతిక పరంగా పి.డి.ఎఫ్. బ్లాగులో ఎలా ఎక్కించాలో తెలియదు.
ఒకసారి తాడెపల్లి వివరించారు గాని అప్పుడు విఫలమయ్యాను.
ఈ విషయం ఎవరైనా సహాయం చేస్తే సంతోషిస్తాను.
Thursday, May 15, 2008
అమ్మ - బ్లాగ్ - సంకలనం
Tuesday, May 13, 2008
అమ్మ - బ్లాగు సంకలనం
అమ్మంటే ఓ అద్భుతం
అమ్మంటే ఓ అపురూపం
మురిపాలు, జ్ఞాపకాలు,
లాలిపాటలు, గోరుముద్దలు
అక్షరాలు, ఆలింగనాలు
నడక నడత
ఆనురాగాలు ఆత్మీయతలు
ఇంకా ... ఇంకా..
మీ గళంనుండి కలం నుండీ పంచుకోండి
ఓ మరుపురాని జ్ఞాపకాన్ని తయారు చేద్దాం
మదర్స్ డే సందర్బంగా మీ పోస్టులను, మీ భావాలను, మీ అభిమానాన్ని తెలియజేస్తూ రాసినవి నాకు వేగు పంపండి.
ఈ ఆలోచనలలో మీరు పాలుపంచుకోండి
ఎంత త్వరగా పంపితే అంత మంచిది.
లింకు ఇవ్వడం మర్చిపోకండి
పుస్తకంగా(పి.డి.ఎఫ్.) కూర్చి పంపుతాను.
john000in@gmail.com
Monday, May 5, 2008
ఈత - బ్లాగ్విషయం - సుడిలో నా అనుభవం

నేను పోలవరంలొ హైస్కూలు చదువుతున్న రోజుల్లో ప్రతీరోజూ గోదావరిలో ఈత, స్నానం, ఆటలు జరిగేవి.
ఓ రోజు లాంచీల రేవులోకొందరు మిత్రులు ఈదుతూ కొంత దూరంలో నిలబడి ఇక్కడలోతు తక్కువగా వుంది రా అని పిలచారు. నిజానికి లాంచీలరేవు లోతుగా వుంటుంది. నేను రాను బజారు రేవుకు(ఆలవాటైనది, రోజూవెళ్ళేది) పోతాను అన్నాను. కానీ స్నేహితులు పిలచేసరికి దిగాను. కొద్దిదూరం ఈదగానే ఒక్కసారిగా మునిగిపోవటం జరిగింది. మొఖానికి వంటికి ఏదో నాచు లాంటిది మెత్తగా తగిలింది. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఎలాగో తెగించి పైకిలేచాను. ఒక్క దమ్ము ఊపిరి తీసుకోగానే అర్థం అయ్యింది నేను సుడిలో పడ్డానని. నా బలాన్ని అంతా వుపయోగించి తపతపా కొట్టుకున్నాను. ఎలాగో బటపడ్డాను. ఒడ్డుకుచేరి కొద్దిసేపు తెప్పరిల్లాను, నన్ను పిలుస్తున్న నా మిత్రులు నేను కొత్త పల్టీలు కొడుతున్నా నని నవ్వుతున్నారు. తీరా విషయం తెలిసాక వాళ్ళుకూడా ఆరేవులోకి మళ్ళీ వెళ్ళలేదు. ఒక రకంకంగా చావు తప్పి బ్రతికాననిపిస్తుంది.
Friday, May 2, 2008
ఈత - బ్లాగ్విషయం-3

ఈత - బ్లాగ్విషయం
మా ఇంటిలో నాకన్నా పెద్దవాళ్ళు నలుగురు వుండటంవల్ల, వాల్లూ వివిధ తరగతులలో చదువుతుండటవలన వారు చదివేవి నాకు కూడా తెలిసేవి. బహుశ ఓ రెండు మూడు సంవత్సరాలు మా కాలనీలోని పిల్లలు అందరూ రాత్రిపూట మా వరండాలోనో, పెరట్లోనో పెట్రమాక్సు లైటువెలిగించి(అప్పటికి ఇంకా మా కాలనీకి విద్యుత్తు రాలేదు) చదువుతూ వుండేవారు. అందులో అన్ని తరగతుల వాళ్ళు వుండే వారు. అలా వాళ్ళు చదువుతున్న వాటిలో నాకు బాగా గుర్తువున్న పాఠం ఇంగ్లీషు చానల్ని ఈదడం. అది నన్ను చాలా ప్రభావితం చేసింది.
అప్పటినుంచి ఈతను గురించిన వార్తలు విన్నప్పుడల్లా హృదయం ఉప్పొంగుతూ వుంటుంది.
శ్రీలంక భారత్ మద్య ఈదిన వారు, ఇంగ్లీషు చానల్ ఈదిన వారు, సునామీలో అండమాన్‌నుంచి ఈదుకొచ్చిన 15సంవత్సరాల పిల్ల, ఇవి వింటున్నప్పుడు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఛేదించే కొత్త మార్గాలను వెతకాలనిపిస్తుంది.
ఈత ఇప్పుడు శారీరక వ్యాయామము లేదా క్రీడా విషయంగా మారిపోయింది.
అప్పుడప్పుడు సముద్ర స్నానాలు చేస్తున్నా, సముద్రంలో ఈత వ్యాపకం మన భారత దేశములో అందులోనో తెలుగువాళ్ళకి తక్కువే అనిచెప్పవచ్చు.
ఈ బ్లాగు రాసే సమయానికి వున్న ఎండవేడిమికి దగ్గరేదైనా ఈతకొట్టే అవకాశం వుంటే బాగుండును అనిపిస్తుంది.
1980-85 ల మద్య మద్యప్రదేశ్‌లోని, సోని నదిపై బాన్‌సాగర్ వద్ద కడుతున్న ప్రాజెక్టులోనో, నర్మదాపై కడుతున్న బర్గీ(జబల్పూర్)డాం కడుతున్న కంపెనీలో పనిచేసాను. శీతాకాలం చలిలో ఉదయం స్నానం, ఈత ముగించుకొని గట్టుపైకి వస్తే వణికించే చలి ఇంకా కళ్ళముందు కదలాడుతుంది.
నర్మదా నీళ్ళు ఎప్పుడూ చాలా చల్లాగావుండేవి. అక్కడరేవులుకూడా చాలాలోతుగా వుండేవి.
సోనీ నదిలో మరో భయం వుండేది. అదేమిటంటే కొన్ని గ్రామాలలో కొన్ని జాతుల వాళ్ళు చనిపోయిన దేహం సగం కాలిన తర్వాత దేహాన్ని నదిలోకి తోసేస్తారు. అవి చివుకుతూ చివికుతూ కొట్టుకువస్తాయి. ఒకసారి నేను ఈతకొదుతున్నాప్పుడు ఒక అనుభవం ఎదురయ్యింది. వళ్ళు జలధరించింది. కొంతకాల ఆ జలధరింపుపోలేదు.
ఈ హైదరాబాదు వచ్చిన తర్వాత ఈత మర్చిపోయానేమో అనిపిస్తుంది
Wednesday, April 30, 2008
ఈత బ్లాగ్విషయం 2
ఈత - బ్లాగ్విషయం
బహుశ నా 8-9 సంవత్సరాల వయస్సులో మొదటిసారి ఈతకోసం ప్రయత్నించిన గుర్తు.
గోదావరి నదిలొనే నా ఈతకుశ్రీకారం చుట్టాను. కొరుటూరు, టేకూరు, కొండమొదలు, పోలవరం, పట్టిసీమ, కొవ్వూరు, కొత్తపేట, రాజమండ్రి, ఔరంగబాద ఇవి నేను ఈతకొట్టిన రేవులు. ఒక స్థలానికీ ఇంకొకస్థలానికీ మద్య పోలికలు, అనుభవాలు వేరువేరుగా వున్నాయి.
పోలవరంలో విద్యాభ్యాసం జరిగినంతకాలం ప్రతీరోజూ గోదావరిలో స్నానంచేయడం, స్నానాకి వెళ్ళవద్దు అని ఇంటిలోనివాళ్ళు నిర్భందిస్తే కావిడతీసుకొని, నీళ్ళుతెస్తానని ఒంకపెట్టడం అలవాటయ్యింది
వేసవి లేదా ఎండగా వున్న రోజులలో ఎప్పుడు స్కూలు అయిపోతుందా, ఎప్పుడు ఎందకొంచెం తగ్గుతుందా అని ఎదురుచూసిన సందర్భాలు చాలావున్నాయి.
గోదావరిరేవుకు వెళ్లినతర్వాత, కేరింతలు, నీళ్ళలోనే ఈదుతూ దాగుదుమూతలు, అప్పుడప్పుడు పల్లెవాళ్ళు(చేపలు పట్టే) వారి పడవలను తోసుకువెళ్ళి ఆవలి వైపుకు వెళ్ళడం జరిగేవి. ఇలా ఆదుకొన్న రోజులు బహుశ 6-8 తరగతి వయస్సు మరియు స్నేహితులు వుండేవారు.
ఈ బ్లాగు కోసం వారిని ఒకొక్కరిని గుర్తుచేసుకున్నాను
నాగేశ్వరర్రావు, తూము రమచంద్రరావు, భాషా, కాగితాల రాంబాబు, సుబ్బారావు వీరుమాత్రమే గుర్కువచ్చారు.
నేను ఒకఒమ్మాయికి ఈతనేర్పడం మా సమూహంలో చంచలన విషయం. ఆ అమ్మాయి నేను అప్పటికి 8వ తరగతి చదివేవాళ్ళం.
నేను ఈతకొడుతూ ఎవరినీ రక్షించిన జ్ఞాపకాలు లేవుగాని, అప్పుడప్పుడు నీళ్ళకోసం వచ్చిన వారి బిందెలు కడుగుతున్నప్పుడు ప్రవాహానికి కొట్టుకపోయేవి, చూస్తుండగానే లోతులోకో, దూరంగానో వెళ్ళిపోయేవి. అలాంటి సమయంలో వాటిని(ఈదుకొని) తెచ్చిన గుర్తులు రెండో మూడొ ఇంకా ఎక్కువో వుండవచ్చు.
ఒకేరేవులో స్నానం చేస్తూనో ఈతకొడుతూనో వుండటంవల్ల దాని లోతు పాతులు, సుడులు తెలిసి జాగ్రత్తగా వుండేవాళ్ళం. అయినా అప్పుడూ రెవులో స్నానచేస్తూ కొట్తుకుపోయిన, మునిగిపోయిన సంఘటనలు జరిగేవి. అలాంటప్పుడు కొన్నిరోజులు మా బాచ్‌పై గోదావరికి వెళ్ళకుండా నిఘా వుండేది.
అప్పుడే మునుగీత, బారలు, వనుకకు ఈదడం(బాక్ స్త్రొక్), ములిగితేలుతూ (బట్తర్ ప్లై) , నిలువు ఈత, ఒకేచోట నీళ్ళపై తేలివుండటం, ఇలా కొన్ని రకాలు నేర్చుకొనటం జరిగింది
....... తర్వాత టపాలో మరికొన్ని
Subscribe to:
Comments (Atom)